జగన్ ప్రభుత్వమే మళ్ళి అధికారంలోకి వస్తుందా?
తాజాగా వెల్లడైన సర్వేలు ఎం చెపుతున్నాయి?
టైమ్స్ నౌ సర్వేలో జగన్ వైపు జనం మొగ్గు
నవ భారత్ సర్వేలోనూ జగన్ కే పట్టం
తగ్గుతున్న TDP గ్రాప్, YCPకి తగ్గని ఆదరణ
పవన్ ను పట్టించుకోని ప్రజలు
సర్వేలన్నీ వైసీపీ వైపే జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రస్తుత లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంది. త్వరలో ఏపీ అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్ని ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వచ్చే ఎన్నికలలో చావో, రేవో తేల్చుకోవాల్చిన పరిస్థితి. ఇందు కోసం అటు జనసేన, ఇటు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాయి. జనసేనతో పొత్తు దాదాపు ఖారారైంది. జగన్ తనకు ఎవరి మద్దతు అవసరం లేదని.. ప్రజా మద్దతు తనకు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి చేసిన మంచి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందకు వెళ్తున్నారు. ఇదే సమయంలో వరుసగా జాతీయ సంస్థలు పబ్లిక్ పల్స్ తెలుసుకొనే ప్రయత్నంలో ఏపీకి సంబంధించి కీలక ఫలితాలను ప్రకటించాయి.
2019ను మించేలా అంచనాలు ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాలు దక్కించుకుంది. 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. కేంద్రం తీసుకొనే నిర్ణయాల ఆమోదంలో వైసీపీకి కీలకంగా మారుతోంది. ఈ సమయంలో గతంలో వచ్చిన సర్వేలు..తాజాగా వెల్లడైన టైమ్స్ నౌ..నవ భారత్ సర్వేలోనూ తిరిగి ఏపీలో వైసీపీ హవా కొనసాగటం ఖాయమని తేల్చింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలను 24-25 వరకు వైసీపీ గెలుచుకుంటుందని ఈ సర్వే సంస్థ కూడా వెల్లడించింది. టీడీపీకి 0-1గా పేర్కొంది. జనసేన అసలు లోక్ సభ రేసులో లేదు. అయితే, అనూహ్యంగా ఓట్ల షేరింగ్ శాతం వైసీపీకి 51.30 గా పేర్కొంది. దీని ద్వారా గతం కంటే కొంత పెరిగినట్లు తేల్చింది. టీడీపీకి 36.20, జనసేనకు 10.10 శాతం ఉన్నట్లుగా సర్వే సంస్థ వెల్లడించింది.
జగన్ ధీమా వెనుక వరుసగా వస్తున్న సర్వే నివేదికలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి. అటు క్షేత్ర స్థాయిలో పవన్ వారాహి యాత్ర తరువాత టీడీపీ ప్రచారంలో వెనుకబడింది. ఈ రెండు పార్టీలు కలిసినా వైసీపీ కంటే వెనుకబడినట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఓట్ల శాతం కంటే జనసేన ఓటింగ్ శాతంలో కనిపిస్తున్న మార్పులు ఆసక్తి కరంగా మారుతోంది. రెండు పార్టీలు కలిసినా జగన్ ను టచ్ చేయలేరని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో తన ఓట్ బ్యాంక్ మరింత సుస్థిరం చేసుకొనే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. 25 లోక్ సభ స్థానాల్లో 24 వైసీపీ గెలుచుకుంటుందనే లెక్కలతో అసెంబ్లీ సీట్లు కూడా 2019 తరహాలోనే గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. తాజా ఫలితాలతో వైసీపీలో మరింత జోష్ కనిపిస్తోంది.