పవన్ కల్యాణ్‌పై పోలీసు కేసు
వారాహి యాత్రలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై పోలీసు కేసును నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేయాలనీ ప్రభుత్య్వం అదేశారు జారీ చేసింది. వారాహి యాత్రలో వాలంటీర్ల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జులై 9న ఏలూరు సభలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంత మంది మాత్రమే ట్రేస్ అయ్యారు.. మిగతా వారు ఏమయ్యారో తెలియదని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు..
జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నా: పవన్ కల్యాణ్
రాష్ట్రం కోసం జైలు కెళ్లడానికి, దెబ్బలు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపాను వీడిన ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు గురువారం మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...''వాలంటీర్లపై మాట్లాడినందుకు నన్ను ప్రాసిక్యూట్ చేయమని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఒక సారి మాట చెబితే అన్ని రిస్క్‌లు తీసుకునే చెబుతా. నన్ను అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైన సిద్ధంగా ఉన్నా. మీరు ప్రాసిక్యూషన్ అంటే నేను సిద్ధంగానే ఉన్నా. న్యాయం కోసం మాట్లాడితే నోటీసులు వస్తాయి. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం. మీరు చేసే పనులు కోర్టులు కూడా చూస్తున్నాయి. ఒక్కో వాలంటీరుకు ఇచ్చే రోజు వేతనం 164 రూపాయలు. డిగ్రీ చదివిన వారికి ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారు.. అంటూ వివరించారు.