7, జూన్ 2026, ఆదివారం

మారుతున్న జి డి నెల్లూరు టిడిపి రాజకీయం

 మారుతున్న జి డి నెల్లూరు టిడిపి రాజకీయం

* రాజీ పోయిన థామస్, చిట్టిబాబు 
* ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుని మార్పు
* మండల పార్టీ అధ్యక్షుల మార్పుకు సిద్ధం
* అడ్డం తిరిగిన మరో వర్గం
* చంద్రబాబుకు నాయుడుకు రెడ్ల విజ్ఞప్తి
* పార్టీ కార్యకర్తల్లో గందరగోళం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి రాజకీయాలు మారుతున్నాయి. ఈ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నీ తానై థామస్ కు అండదండగా నిలచిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు ఎన్నికల అనంతరం విభేదాలు కారణంగా దూరమయ్యారు. రెండు సంవత్సరాలపాటు విభేదాల కారణంగా దూరంగా ఉన్న ఎమ్మెల్యే తామస్, భీమినేని చిట్టిబాబు ఇటీవల కాలంలో కలిసిపోయారు. ఫలితంగా ఎమ్మెల్యే పి ఏ గా ఉన్న చంద్రశేఖర్ ను మార్పు చేశారు. రెండు మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులను మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు మండలాల్లో చిట్టిబాబుకు అనుకూలురను నియమించుకోవాలని అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదరడంతో  ఎం వి ఆర్ ఎస్ ద్వారా జరిగే కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని భావించినట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలో మెజార్టీగా ఉన్న రెడ్లకు అన్యాయం జరుగుతుందని మరో వర్గం రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. 

 30 ఏళ్ల తరువాత 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచిన డాక్టర్ వి ఎం థామస్ కు సీఎం చంద్రబాబు నాయుడు విప్ పదవి బహుమతిగా ఇచ్చారు. అయితే అక్కడి వర్గ రాజకీయాల వల్ల పార్టీ కార్యకర్తల పరిస్థితి గందరగోళంగా తయారు అయ్యింది. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం ఏర్పాటు చేశారు. థామస్ వైసిపి నుంచి వచ్చిన కొందరికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేశారు.
 రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. గత ఏడాది జరిగిన మండల కమిటీ అధ్యక్షులు ఎన్నిక ఏకపక్షంగా జరిగాయని ఆరోపణలు రచ్చకెక్కాయి. ఆరు మండలాల్లో థామస్ తన వారిని ఎన్నుకున్నారని ఆరోపణలు వెళ్ళు వెత్తాయి. జి డి నెల్లూరు, కార్వేటినగరం,ఎస్ ఆర్ పురం, పెనుమూరులో అనకు అనుకూమైన పాత అధ్యక్షులనే తిరిగి కొనసాగించారు. పాలసముద్రంలో రాజేంద్ర( ఎస్సీ) ను తొలగించి శివా నాయుడును, వెదురుకుప్పంలో కె లోకనాథ రెడ్డిని తొలగించి మోహన్ మురళి ( ఎస్సీ) ని నియమించారు. ఈ ఎన్నికలు చాలా వివాదాలకు దారి తీశాయి. ఆరు మండలాల్లో ఒకటి కూడా రెడ్డికి ఇవ్వకపోవడాన్ని సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు. చిట్టిబాబు తన స్వంత మండలం పాలసముద్రంలో వాసు నాయుడును, వెదురుకుప్పంలో కిషన్ చెందును నియమించాలని అధిష్టానం పై ఒత్తిడి తెచ్చారు. ఈ వివాదాలు ముదిరి ఎమ్మెల్యేపై రెండు వర్గాలు ఫిర్యాదులు చేయడం జరిగింది. నియోజక వర్గంలో ఎమ్మెల్యే వర్గం ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపద్యంలో థామస్ ఒక దశలో ఒక వర్గంపై మీడియా సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజక వర్గంలో ఎవరైనా ఒక ట్రాక్టర్ గ్రావెల్ తరలిస్తే కొందరు మీడియాలో పెద్ద ఎత్తున వార్తా కథనాలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి, నగరి నియోజక వర్గాలలో టిప్పర్ లతో అక్రమ రవాణా చేసినా పట్టించుకోరని తీవ్ర విమర్శలు చేశారు. ఇది వైరల్ కావడంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే థామస్ ను పార్టీ కార్యాలయానికి పిలిపించి వివరణ కోరారు. ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. అందరిని కప్పుకుని పోవాలని సూచించారు. దీనితో ఇటీవల తిరుపతిలోని ఒక హోటల్ లో ఎమ్మెల్యే థామస్, చిట్టిబాబు వర్గం ఏకమయ్యారు. చిట్టిబాబు డిమాండ్లను ఎమ్మెల్యే ఒప్పుకున్నారు. 
ఆమేరకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న గుడిపాల ఎంపిపి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ పి చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే తొలగించారు. ఆయన స్థానంలో జి డి నెల్లూరు ఎంపిపి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న టి చంద్రబాబును తీసుకున్నారు. వైసిపి నుంచి వచ్చిన హరీష్ యాదవ్, గుణశేఖర్ యాదవ్, శరవణను పక్కన పెట్టారు. పాలసముద్రం, వెదురుకుప్పం మండల అధ్యక్షులను మార్చడానికి సమ్మతించారు. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే చేయమని అధిష్టాన వర్గానికి సూచించారు.

అడ్డుపడిన మరో వర్గం :
ఇదిలా ఉండగా చిట్టిబాబు సూచన ప్రకారం మండల కమిటీలు మార్చడానికి ఎమ్మెల్యే సమ్మతించిన నేపద్యంలో వెదురుకుప్పం రెడ్డి సామాజిక వర్గం నేతలు అడ్డు పడుతున్నారు. శుక్రవారం వెదురుకుప్పం మండల మాజీ అధ్యక్షుడు కె లోకనాథ రెడ్డి గృహంలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ మునిచంద్రా రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు బి సుధాకర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి చంగల్రాయ రెడ్డి తదితరులు సమావేశమై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు విజ్ఞప్తి చేశారు. 
 నియోజక వర్గంలో 57 వేల మంది ఉన్న తమ సామాజిక వర్గానికి ఒక మండల కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 70 వేల మంది ఉన్న ఎస్సీలకు రెండు మండలాలు కేటాయించారని, ఇప్పుడు వెదురుకుప్పంలో ఎస్సీ అధ్యక్షుడిని తొలగించి యాదవ సామాజిక వర్గానికి చెందిన కిషన్ చంద్ ను నియమించే ప్రయత్నం చేయడం భావ్యం కాదని అన్నారు. ఒక వేళ మార్చవలసి వస్తే రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గంలో 10 వేలమంది ఉన్న యాదవులకు ఇప్పటికే కార్వేటినగరం మండల అధ్యక్ష పదవి ఇచ్చారని. వెదురుకుప్పం కూడా అదే సామాజిక వర్గానికి ఇవ్వడం సామాజిక సమ న్యాయ సూత్రానికి విరుద్ధం అన్నారు. పైగా ఎన్ ఆర్ ఐ అయిన కిషన్ చంద్ కు ఓటు హక్కు కూడా లేదన్నారు.

1994లో వేపంజేరిలో టిడిపి అభ్యర్థి ఆర్ గాంధీ గెలిచారని తరువాత ఇప్పటివరకు టిడిపి ఓటమి పాలవుతూ వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ అధిక శాతం ఓట్లు ఉన్న ఎస్సీలు, రెడ్లు మద్దతు పలకడం వల్లనే థామస్ ఎమ్మెల్యే అయ్యారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెడ్డి సామాజిక వర్గానికి ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. అయితే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, వెదురుకుప్పం మండల అధ్యక్షునిగా ఉన్న కె లోకనాథ రెడ్డిలను ఉన్న పదవుల నుంచి తొలగించారని వాపోయారు. నియోజక వర్గం వైసిపిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎంపీపీలు, ఒక జడ్పీటీసీ ముగ్గురు మండల కమిటీ అధ్యక్షులు ఉన్న విషయం గుర్తు చేశారు. అలాగే ఇద్దరికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో విజయానంద రెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా, జ్ఞానేంద్ర రెడ్డి, డాక్టర్ వాసుదేవ రెడ్డి సలహాదారులుగా ఉన్నారు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాలంటే రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు అవసరం అన్నారు. ఈ నెల తొమ్మిదవ తేదీన తిరుపతి రానున్న పల్లా శ్రీనివాస్ ను కావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా నియోజక వర్గంలో  ఓట్లు ఎక్కువ లేని ఒక వర్గానికి పెద్దపీట వేశారని ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం కార్యకర్తలు వాపోతున్నారు. పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షునిగా శివా నాయుడు, ఎస్ ఆర్ పురం అధ్యక్షుడిగా జయశంకర్ నాయుడు, పెనుమూరు మండల అధ్యక్షునిగా రుద్రయ్య నాయుడు ఉన్నారు. టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా చిట్టిబాబు నాయుడు, పాలసముద్రం) కార్యదర్శిగా అరుణ ( పెనుమూరు) నియమితులు అయ్యారు. పెనుమూరు మండలానికి చెందిన బి ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా జి డి నెల్లూరు కు చెందిన కృష్ణమ నాయుడు పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఒక పదవికూడా ఇవ్వక పోవడం పట్ల ఒక వర్గం అసంతృప్తితో ఉంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *