21, ఆగస్టు 2024, బుధవారం

రోజురోజుకూ తగ్గుతున్న పాల ధరలు అందోళన చెందుతున్న పాడి రైతులు

రెండు నెలలుగా క్రమంగా తగ్గుతున్న పాల ధరలు 

లీటరు మీద  రూ. 10 తగ్గన పాల ధర 

కొత్త రైతుల నుండి పాలు తీసుకోని డైరీలు 

గిట్టుబాటు కాకుండా ఆవులను అమ్ముకుంటున్న రైతులు 

పాడి రైతుల గోడుపట్టని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు  

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


చిత్తూరు జిల్లాలో పాల గిట్టుబాటు ధర రోజు రోజుకు తగ్గుతోంది. దీంతో పాడి రైతులకు గిట్టుబాటు కాకుండా రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఆవుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.  ఉన్న ఆవులను అమ్ముకుంటున్నారు. జిల్లాలోని ప్రైవేటు డైరీలు ఇచ్చినంత తీసుకోవడం తప్ప, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పాడి రైతులు ఉన్నారు. పాడి రైతుల నిస్సాయతను అదునుగా తీసుకోని, ప్రైవేటు డైయిరీలు పాడి రైతుల కష్టాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. రైతులు నష్టపోతుండగా, డైయిరీలు మాత్రం లాభాలను అర్జిస్తున్నాయి. పాడి రైతుల సమస్యల గురించి పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో వారికి గిట్టుబాటు ధర లభించడం లేదు. గత రెండు నెలలుగా చిత్తూరు జిల్లాలో పాల రేట్లు ఘనంగా పడిపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. 


చిత్తూరు జిల్లాలో రైతాంగం చాలావరకు పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో పాడి ఆవులు కనిపిస్తాయి. ఈ పాడే ఆవులను తమకు జీవన ఉపాధిగా గ్రామీణ రైతులు భావిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు పాడి పరిశ్రమనే నమ్ముకున్నారు. చిత్తూరు జిల్లాలో రోజురోజుకు పాడి పరిశ్రమ విస్తరిస్తోంది. పాల దిగుబడి కూడా పెరుగుతుంది. చిత్తూరు జిల్లాలో ఆరు లక్షల వరకు పాడి ఆవులు, 5,500 వరకు పాడి ఎనుములు ఉన్నట్లు అంచనా. ఇవి రోజుకు 20 లక్షల లీటర్ల కొరకు పాలను ఇస్తున్నాయి. ఇందులో ఇంటి అవసరాలు, పాల వ్యాపారస్తులు అమ్మడం మినహాయించి జిల్లాలోని డైయిరీలకు 11 లక్షల లీటర్ల పాలు రోజుకు చేరుతుంది. పాల సేకరణకు చిత్తూరు జిల్లాలో బిఎంసి లతో కలిపి 21 డైయిరీలు పనిచేస్తున్నాయి. ఇందులో ప్రైవేటు డైయిరీలదే సింహభాగం. చిత్తూరులోని సహకార డైరీ మూతపడడంతో ప్రైవేటు డైయిరీలు ఆదిపత్యం కొనసాగుతోంది. వీరు నిర్ణయించినది ధర. ఎంత ఇస్తే అంత రైతులు తీసుకోవాల్సిందే. డైయిరీ యాజమాన్యాలను పాడి రైతులు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎవరైనా అడిగితే ఇష్టముంటే పాలు పోయి, లేకుంటే మానుకో అనే ధోరణిలో ప్రైవేటు డైయిరీలు వ్యవహరిస్తున్నాయి. పాలలో నాణ్యత లేదని, వెన్న శాతం తక్కువగా ఉందని, రకరకాల సాకులతో రైతులకు ఇచ్చే మొత్తాలను ఘననీయంగా తగ్గిస్తున్నారు. రెండు నెలల కిందట లీటర్ల పాలకు 40 నుండి 43 రూపాయలు వస్తుండగా ప్రస్తుతం 28 నుండి 30 రూపాయలు కూడా రావడం లేదు. కొందరికి 28 రూపాయలు కూడా ఇస్తున్నారు. లేత పలు అని ధర తగ్గిస్తున్నారు. ఒక్కొక్క డైయిరీ ఒక్కొక్క రకంగా పాడి రైతులకు గిట్టుబాటు ధరలు చెల్లిస్తోంది. ఏ రెండుడైయిరీలు ఇచ్చే ధర ఒకటిగా లేదు. ఇందులో హెరిటేజ్ డైయిరీ కొంత నయమని పాటి రైతులు చెబుతున్నారు. మిగిలిన ప్రైవేటు డైయిరీలు రైతుల శ్రమలు దోచుకుంటున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలున్నవదని పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు.  ఆవులను మేపుతూ వాటి ఆలనా, పాలనా చూస్తూ పాలు పిండి అమ్ముకోవడమే జీవనోపాధిగా కొనసాగిస్తున్నారు. అయితే గత రెండు నెలలుగా పాల ధరలు పడిపోవడంతో జిల్లాలోని పాడి రైతులకు దిక్కుతోచడం లేదు. ఈ విషయంలో జిల్లాలో అధికార యంత్రాంగం,  ప్రజాప్రతినిధులు గాని, రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటు డైయిరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు డైయిరీలు సిండికేట్ గా తయారై పాల ధరలను తగ్గిస్తున్నారని, పాడి రైతుల అభిప్రాయపడుతున్నారు. అయితే పశుసంవర్ధక శాఖ అధికారుల వాదన భిన్నంగా ఉంది. జిల్లాలో  వర్షాలు బాగా పడటం కారణంగా పచ్చి గడ్డి బాగా దొరుకుతుందని, కావున జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అంటున్నారు. పాల ఉత్పత్తి కి తగిన విధంగా డైయిరీల సామర్థ్యం లేకపోవడంతో పాల సేకరణను  తగ్గిస్తున్నారని అంటున్నారు. ఈ పాల ధర తగ్గింపు తత్కాలికమైనని, మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొందరు రైతు నాయకులు మాట్లాడుతూ మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి చిత్తూరు జిల్లాకు భారీగా పాలు దిగుమతి అవుతుందని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు పాలు దిగుబడి అవుతుండడంతో చిత్తూరు జిల్లాలోని డైయిరీలు పాల గిట్టుబాటు ధరను తగ్గించాయని వివరిస్తున్నారు. అయితే జిల్లాలో కొత్తగా ఆవులను కొని పాలను డైయిరీలకు పోయాలనుకునే పాడి రైతులకు ఇబ్బంది పడుతున్నారు. కొత్త ఖాతాదారుల నుండి  పాలను తీసుకోవడం లేదు. తమకు ఇప్పటికే పాలు అధికంగా వస్తుందని, కావున కొత్త పాడి రైతుల నుంచి పాలన తీసుకోలేమని తగేసి చెబుతున్నారు. దీంతో కొత్తగా పాడి ఆవులకొన్న రైతులు తమ పాలను ఏం చేసుకోవాలో తెలియకుండా, ఇంటి అవసరాలకు ప్రైవేటు వెండర్స్ కు విక్రమిస్తున్నారు. పాల ధరలు తగ్గడంతో జిల్లాలో పాడి రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు  జోక్యం చేసుకొని బాల గిట్టుబాటు ధరలు తిరిగి పెంచడానికి చర్యలు తీసుకోవాలని జిల్లాలోని పాడి రైతులు కోరుతున్నారు.

*గిట్టుబాటు కావడం లేదు* 

ఆవుల దాణా రేట్లు పెరుగుతున్నాయి. పోషణ కష్టం అయిపోతుంది. అందుకు తగిన విధంగా పాలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. గత రెండు నెలలుగా క్రమంగా పాల ధరలు తగ్గుతున్నాయి. దీనివల్ల పాడి రైతులు చాలా నష్టపోతున్నారు. ఒక మనిషి దిలసరి కూలీ కూడా లభించడం లేదు.

గంగ 2: తిమ్మోజిపల్లి రేఖ,పెండ్లిగుండ్లపల్లి.


*ఉన్న ఆవులు అమ్మేశాను*

పాల ధరలు ఆశాజనకంగా లేవు. గతంలో లీటరుకు 43 రూపాయల వరకు వస్తుండగా ప్రస్తుతం లీటర్లకు 30 కూడా రావడం లేదు. లేత పాలు అవుతే 28 రూపాయలు కూడా రావడం లేదు. ఆవుల పెంపకం మీద ఆసక్తి తగ్గిపోతుంది. గతంలో ఆరు ఆవులు  ఉండగా మూడు ఆవులను అమ్మేశాను. మూడు ఆవులు పాలు మాత్రం పిండి పోస్తున్నాను. అయినా గిట్టుబాటు ధర రాకపోవడంతో చాలా బాధగా ఉంది.

 గంగ 3: ఈదర చంద్రశేఖర్, పెండ్లి గుండ్లపల్లి


*డైయిరీలు సిండికేటు అయి ధరలు తగ్గించారు*

 పాడి ఆవుల పోషణ ఖర్చు బాగా పెరిగిపోయింది. దాణా, పెసరపప్పు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. పాలు ధరలు గత రెండు నెలలుగా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రైవేటు డైయిరీలు సిండికేట్ గా ఏర్పడి, పాల ధరలను తగ్గిస్తున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ఎవరు మాట్లాడడం లేదు. కావున పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాలు లీటరుకు 50 రూపాయలు ఇస్తే గాని రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఈ విషయంలో జిల్లా అధికారులు కలగజేసుకొని పాల ధరను మునుపటి లాగా పెంచాల్సిన అవసరం ఉంది.

 గంగ 4: జంగం కవిత, పెండ్లి గుండ్లపల్లి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *