16, ఆగస్టు 2024, శుక్రవారం

మాజీ మంత్రి రోజా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఆడుదాం ఆంధ్ర క్రీడలపై సిఐడి విచారణకు  ప్రభుత్వం ఆదేశాలు

రంగంలోకి దిగిన సిఐడి అధికారులు  

భారీగా అవినీతి జరిగిందంటూ ఫిర్యాదులు

అరెస్టు తప్పదంటున్న కూటమి నేతలు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


అధికారంలో ఉన్నప్పుడు పదునైన మాటలతూటాలతో ప్రతిపక్ష్యాన్ని ఇరుకున పెట్టిన మాజీమంత్రి రోజా నేడు పీకల్లోతు కష్టాల్లో కురుకుపోయింది. త్వరలోనే ఆమె అరెస్టు తప్పదని కూటమి నేతలు బహిరంగంగా అంటున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీలో భారీగా దర్శనం టికెట్లు అమ్ముకుందని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయం మీద టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఆడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున నిధులు దుర్వినియాగం జరిగిందని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులుతాయి. దీంతో కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో నగిరి నుంచి ఓడిపోయి అవమాన భారంతో ఉన్న రోజాకు టిటిడి దర్శనం టికెట్లు, ఆడుదాం ఆంధ్రా నిధుల కుంభకోణం తలనొప్పిగా మారాయి. ఇవి వ్యవహారంలో ప్రభుత్వం దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి


ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆటలా పోటీలను నిర్వహించింది. అలాగే సిఎం కప్ పోటీలను కూడా నిర్వహించింది. ఈ క్రీడల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు వచ్చాయి.  ఇందుకోసం అప్పట్లో సుమారు రూ 125 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రీడలను యువజన సర్వీసులు, క్రీడా శాఖ, సాప్ ఆధ్వర్యంలో సుమారు రెండు నెలలపాటు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వార్డు గ్రామ సచివాలయ పరిధిలో తొలుత పోటీలు నిర్వహించారు. అనంతరం మండల, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పోటిలను నిర్వహించి, రాష్ట్ర స్థాయి పోటిలకు క్రీడాకారులను ఎంపిక చేశారు.  ఈ పోటీలకు సంబంధించి అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆడుకునేందుకు ఇచ్చే క్రీడా పరికరాలు నాణ్యత లోపించిందంటూ ఆరోపణల సైతం వెల్లువెత్తింది. వైసిపి కి చెందిన వారికీ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, వైసిపి నాయకులు, మంత్రులు చెప్పిన వారినే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటిలకు ఎంపిక చేశారని ఆరోపణలు వచ్చాయి. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు టి ఏ, డి ఏ లు కూడా సక్రమంగా ఇవ్వలేదని ఫిర్యాదులు ఉన్నాయి. ఎంతో అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల సందర్భంలో కూడా ఎన్నో ప్రాంతాలలో క్రీడాకారుల మధ్య గొడవలు జరిగి కొట్లాటలకు కూడా దారితీసింది. క్రీడలు నిర్వహణలో కూడా వివాదాస్పద నిర్ణయాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నాలుగు నెలల పాటు క్రీడలను విస్మరించిన ప్రభుత్వం, ఎన్నికల లబ్ది కోసమే అయిదవ సంవత్సరం క్రీడలను నిర్వహించారని టిడిపి నేతలు అప్పుడే ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ది సీఎం కప్పు, ఆడుదాం ఆంధ్ర క్రీటలకు సంబంధించి కేటాయించిన నిధులలో పెద్ద ఎత్తున అవకతవకలు అవినీతి జరిగిందంటూ ఇటీవల  ప్రముఖ కబాడీ క్రీడాకారుడు, అట్య పాట అసోసియేషన్ సీఈవో ఆర్ డి ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేశాడు. సిఐడి కి కూడా ఫిర్యాదు చేసిన ఆయన డీసీఎం కప్, ఆడుదాం ఆంధ్ర పేరుతో అధికారులు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డ సుమారు రూ 100 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. వీటిలో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేసిన ఆర్కే రోజా, ధర్మాన కృష్ణ దాసులపై ఆరోపణలు చేశారు. వీరి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిఐడి ఇందుకు సంబంధించిన సమగ్ర విచారణ జరపాలంటూ తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. క్రీడల నిర్వహణ, క్రీడా పరికరాలకు కొనుగోలు, పారితోషకాలు, వారి ప్రయాణ ఖర్చులు, భిజనాలు, వసతి, బహుమతుల విషయంలో   సమగ్రంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిఐడి  ఏ డి జి సిపికి ఆదేశించారు. దీంతో మాజీ మంత్రి రోజాకు తలనొప్పి ప్రారంభం అయ్యింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సి\ఐడి అరెస్టు చేసినపుడు రోజా స్వీట్స్ పంచి ఆనందాన్ని పొందారు. ఈ విషయాలను టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *