జిల్లాలో రూ. 450 కోట్లతో పాఠశాలల, కళాశాలల ఆధునికీకరణ
867 పాఠశాలల్లో డిజిటల్ టెక్నాలజీతో విద్యాబాధన
441 పాఠశాలల్లో రూ. 208 కోట్లతో 1,635 తరగతి గదుల నిర్మాణం
1,50,170 మంది విద్యార్థులకు రూ. 37.5 కోట్లతో కిట్లు
పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద 61 పాఠశాలల ఎంపిక
'ప్రభ న్యూస్ బ్యూరో' తో ఎస్ ఎస్ ఏ ఏ పి సి వెంకటరమణారెడ్డి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో 450 కోట్ల రూపాయల వ్యయంతో పాఠశాలలు, జూనియర్ కళాశాలల భవనాల మరమ్మత్తులు, ఆధునికరణ చేయనున్నట్లు సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి ఆర్ వెంకటరమణారెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన చిత్తూరులో 'ప్రభ న్యూస్ బ్యూరో' తో మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్ పథకం కింద 1180 పాఠశాలలు, 30 జూనియర్ కళాశాలను ఆధునికరణ చేయనున్నట్లు తెలిపారు. వీటిలో కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలను కలుగజేస్తామని, పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా అత్యంత నాణ్యతతో పనులు చేపడతామని వివరించారు. మనబడి మన భవిష్యత్తు పథకం కింద పాఠశాలల మరుగుదొడ్లకు నిరంతరం నీటి సరఫరా, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కూడిన విధ్యుధీకరణ, శుద్దమైన తాగునీటి సరఫరా, ఉపాధ్యాయులకు, తరగతి గదులలో విద్యార్థులకు ఫర్నిచర్ ఏర్పాటు, భవనాలకు రంగులు వేయుట, మరమ్మతులు ఉంటే చేయడం, గ్రీన్ బ్లోస్లీ చెక్ బోర్డ్స్ ఏర్పాటు చేయటం వంటి పనులు చేపడతామన్నారు. అలాగే ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీ గోడల నిర్మాణము, వంట గదుల నిర్మాణము, మరమ్మత్తులు, తరగతి గదుల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల రిపేర్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువుల కొనుగోలు తదితర సదుపాయాలను ఈ పథకం ద్వారా సమకూర్చనున్నట్లు వివరించారు. డిజిటల్ టెక్నాలజీతో విద్యాబాధన కోసం 867 పాఠశాలల్లో అత్యంత ఆధునికరమైన ఇంటర్ ఆక్టివ్ ప్లాట్ ఫైనల్ స్మార్ట్ టీవీలను మంజూరు చేశామన్నారు. ఇవి కాకుండా 441 పాఠశాలలో 208 కోట్ల రూపాయల వ్యయంతో 1,635 తరగతి గదుల నిర్మాణం, 269 అంగనవాడి స్కూళ్లను ఫ్రీ ఫౌండేషన్ స్కూల్ గా అభివృద్ధి చేస్తున్నామని ఏపీసి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద 31 మండలాల్లోని 1,50,170 మంది విద్యార్థులకు 37.5 కోట్ల రూపాయల వ్యయంతో మూడు జతలు యూనిఫామ్, షూస్, సాక్స్ రెండు జతలు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు, నోట్ బుక్స్ వర్క్స్ బుక్స్ పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న ఎనిమిది మండలాలలో 8 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు, 5 మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్స్ నడుస్తున్నాయని, ఇందులో 2,492 మంది తల్లిదండ్రులు కోల్పోయిన వెనుకబడిన తరగతుల ఆడపిల్లలు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. 2019 - 20 విద్యా సంవత్సరంలో 8 కస్తూరి విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించామన్నారు. విద్యాబోధన కుంటుపడకుండా కేజీబీల్లో ఖాళీగా ఉన్న 84 అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేశామన్నారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద చిత్తూరు జిల్లాలో 61 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఈ పాఠశాలల్లో ఆధునిక మౌలిక వస్తువులను కల్పించడంతోపాటు పాఠశాలలకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ లైబ్రరీలు, క్రీడా సదుపాయాలను కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం జరుగుతున్నన్నారు. ఇందుకు సంబంధించి 30 పాఠశాలలకు 88.41 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. సహిత విద్యా కార్యక్రమం కింద జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 31 మండలాల్లో భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రత్యేక శిక్షణ ఫిజియోథెరపీ స్పీచ్ తెరపి అందించడం జరుగుతుందన్నారు. ఈ పిల్లలకు రవాణా, భత్యం, ఎస్కార్ట్, లీడర్ అలవెన్స్, చిన్నపాటి శాస్త్ర అవసరమైనవి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాలు కల పిల్లలకు వైద్య నిర్ధారణ శిబిరాలు ఉన్న ఏర్పాటు చేసి, వాళ్లకు అవసరమైన సహాయ ఉపకరణాలను, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 228 మానసిక వైకల్యం గల పిల్లలకు అవసరమైన బోధనపు ఉపకరణాలు అందించామన్నారు. సమగ్ర శిక్షా, ఐసిడిఎస్, వికలాంగుల సంక్షేమ శాఖ, సచివాలయ సిబ్బంది సమన్వయంతో వీరికి ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను 206 మందిని గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామని వివరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 36 ఐ ఈ ఆర్ పి పోస్టులను భర్తీ చేశామన్నారు. డిజిటల్ విద్యార్థి డిజిటల్ విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అంగవైకల్యం గల విద్యార్థులకు 213 ట్యూబులను పంపిణీ చేశామని తెలిపారు. గుణాత్మక విద్యా కార్యక్రమంలో భాగంగా 2,494 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల మధ్యంలో విద్యార్థులకు బోధించడానికి శిక్షణ వెంకటరమణారెడ్డి తెలిపారు. దీక్షా కార్యక్రమం కింద 2,135 మంది సెకండరీ గ్రేటర్ ఉపాధ్యాయులకు, 1,521 మంది ప్రైమరీ ఉపాధ్యాయులకు నిష్ట కార్యక్రమం కింద మన జిల్లాలో ఆన్లైన్లో లింకు ద్వారా విజయవంతంగా శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమం ద్వారా ఒకటి నుండి ఐదు తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు కొత్త పాఠ్య పుస్తకాల పైనశిక్షణ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. చిత్తూరు జిల్లా సర్వ శిక్ష అభియాన్ కింద కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గా తనకు ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవం నాడు అమ్దచేశారని సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి ఆర్ వెంకటరమణారెడ్డి వివరించారు.