గనులు భూగర్భ శాఖ ద్వారా రూ. 748. 37 కోట్ల ఆదాయము
జిల్లాలో విస్తారంగా గ్రానైట్ నిల్వలు
జిల్లాలో 665 గనులు, 502 పరిశ్రమలు
ప్రభ న్యూస్ బ్యూరో తో గనులు భూగర్భ శాఖా డిడి ప్రసాద్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
గనులు భూగర్భ శాఖ ద్వారా గత ఐదు సంవత్సరాలలో చిత్తూరు జిల్లాకు 748. 37 కోట్ల రూపాయల ఆదాయము లభించిందని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కే ఎల్ వి ప్రసాద్ వెల్లడించారు. శనివారం ఆయన చిత్తూరులో ప్రభ న్యూస్ బ్యూరోతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో గ్రానైట్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని తెలిపారు. గ్రానైట్ నిక్షేపాలను గుర్తించి వీటిని లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా భారీగా ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, ఆర్ ఎం అండ్ బి ఎస్ గ్రానైట్ రకాలు విరివిగా దొరుకుతాయని తెలిపారు. అలాగే రోడ్ల నిర్మాణానికి వాడే కంకర క్యారీలను కూడా ప్రభుత్వం లీజుకు ఇస్తుందని చెప్పారు. వీటి వల్ల కూడా ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరుతుందని వివరించారు. చిత్తూరు జిల్లాలో అన్ని రకాల గనులు 665 ఉన్నాయని, వీటిల్లో పనులు జరుగుతున్నాయన్నారు. వీటి వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. 2019 20 ఆర్థిక సంవత్సరంలో 122 కోట్లు, 220 21 ఆర్థిక సంవత్సరంలో 150 కోట్లు, 2021 22 ఆర్థిక సంవత్సరంలో 166 కోట్లు, 2022 23 ఆర్థిక సంవత్సరంలో 182 మూడు కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు 127 కోట్ల రూపాయల ఆదాయము లభించిందని ప్రసాద్ వివరించారు. చిత్తూరు జిల్లాలో గ్రానైట్, గ్రావెల్ బేస్డ్ పరిశ్రమలు 665 ఉన్నాయని తెలిపారు. ఇందులో గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లు 425, స్టోరీ క్రాషర్స్ యూనిట్లు 61, క్యూబ్స్ అండ్ కేర్బ్స్ యూనిట్లు 12, ఇతర యూనిట్లు నాలుగు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో క్యార్తజ్ ఐదు, బ్లాక్ గ్రానైట్ రకం 254, కలర్ గ్రానైట్ 277, ఆర్ ఎం అండ్ బిఎస్ రకం 117 నడుస్తున్నాయని తెలిపారు. వీటిని 20 సంవత్సరాలకు ఒక మారు రెన్యువల్ చేయడం జరుగుతుందన్నారు. గ్రానైట్ డిపాజిట్ అయిపోయిన గనులు మూతపడుతుంటాయని, మళ్లీ కొత్తగా గనులు వస్తుంటాయని, ఇది నిరంతర పక్రియగా వివరించారు. పనులు జరగని గనులను క్లోజ్ చేసి, కొత్తగా గనులకు అనుమతిస్తుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ విస్తారంగా దొరుకుతాయని తెలిపారు. అలాగే బ్లాక్ గ్రానైట్లో డోలరైట్ డైక్ రకం చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ రకమైన గ్రానైట్ భారతదేశంలో మరి ఎక్కడ లభించదన్నారు. ఈ రకం గ్రానైట్ కు దేశ విదేశాలలో మంచి గిరాకీ ఉందన్నారు. ఈ రకమైన గ్రానైట్ ను పాలిష్ చేసి ఎగుమతి చేయడం జరుగుతుందన్నారు. గ్రానైట్ ఎగుమతుల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. గ్రానైట్ అక్రమ రవాణా జరుగాకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రసాద్ వివరించారు. ఇందుకు పోలీస్, రెవెన్యూ, భూగర్భ శాఖాధికారులతో ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ తవ్వకాల మీద అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తుంటాయని, వాటిని విచారించి వారి పైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పో రై గంగ 1 గనులు భూగర్భ శాఖా డిడి ప్రసాద్

