14, ఆగస్టు 2024, బుధవారం

కల్తీ వంట నూనెలతో గుల్ల అవుతున్న ప్రజల ఆరోగ్యం

మార్కెట్ లో జోరుగా కల్తీ వంట నూనెలు 

పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు 

అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ ప్రజలు 

ప్రభ న్యూస్ బ్యూరో , చిత్తూరు.


చిత్తూరు జిల్లాలో కల్తీ వంట నూనెలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. తమ లాభం కోసం వంటనూనెలను వ్యాపారస్తులు కల్తీ చేస్తున్నారు. ఆ నూనెలు తిన్న ప్రజలు  ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.  ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కల్తీ నూనెల వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు మాత్రం లాభాలు దండుకొంటుండగా  సామాన్య ప్రజలు అరోగ్యానికి దూరం అవుతున్నారు. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో ఎక్కడ చూసినా కల్తీ నూనెలే దర్శనమిస్తున్నాయి.

 వంట నూనెలు విచ్చలవిడిగా కల్తీ అవుతున్నాయి. కొన్నింట్లో ఏమాత్రం నాణ్యత ఉండడం లేదు. మరి కొన్నింటిని వాడడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కల్తీ వంట నూనెలలో విషపూరితమైన ఆమ్లా టాక్సీలు, ఆరోగ్యానికి హాని చేసే హెచ్ వి మెటల్స్ ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా ఇటేవల నిర్వహించిన పరీక్షల్లో తేలింది. వంట నూనెల్లో ముఖ్యంగా వేరుసెనగ నూనె అత్యధికంగా కల్తీ అవుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత స్థానంలో సోనియా బీన్, రైస్ బ్రాన్, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలు ఉన్నాయి. వంట నూనెల్లో నాణ్యత కూడా ఉండాల్చిన స్థాయిలో లేవని వెల్లడైంది.  దేశవ్యాప్తంగా  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో మరో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 4461 శాంపిల్స్ తీసి, పరిక్ష చేసింది. వాటిలో నాణ్యత  ఒక నివేదికను  విడుదల చేసింది. వంటనూనెల విషయంలో  ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. మొత్తం పరీక్ష చేసిన శాంపుల్స్ లో 2. 64  శాతం హానికరమని తేలింది. ఇలాంటి వాటిని జనాలు కొంతకాలం పాటు తింటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మరో 10.15 శాతం శాంపుల్స్ లో నాణ్యత లేదని పేర్కొంది. ఇక 17.8 శాతం శాంపిల్స్ లో ఇవి ఎక్కడ తయారు చేశారు ? ఎవరు తయారు చేశారు ? అనే వివరాలు, బ్రాండ్ నేమ్  లేవని పేర్కొంది.  నిబంధనల  ప్రకారం వ్యాపారులు లూజ్ అమ్మకాలు చేయకూడదని,  కానీ ఎక్కువగా లూజ్  నమ్మకాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. లూజ్ అమ్మకాల్లో కల్తీ ఎక్కువ జరిగే  ఆస్కారం ఉందని ప్రజలను హెచ్చరించింది. సేఫ్టీ, క్వాలిటీ లేని వంటనూనెలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందనే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకం ఏర్పడతాయని అంటున్నారు. ఒళ్ళు నొప్పులు,  హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధులకు  దారి తీయవచ్చునని ఆందోళన చెందుతున్నారు. కల్తీ నూనెతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, జీర్ణ వ్యవస్థ చెడిపోతుందని, గుండె జబ్బులు వస్తాయని తెలియజేస్తున్నారు. వంట నూనెలను లూజ్ గాకుండా ప్యాకెట్లను తీసుకోవాలని, వాటిపైన ఎక్కడ తయారు చేశారు, ఏ కంపెనీ తయారు చేసింది, అనే విషయాల స్పష్టంగా ఉండే విధంగా చూడాలని సూచిస్తున్నారు. శరీరంలో కొవ్వు పెరిగి గుండె  సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వంట నూనెలపైన రాష్ట్రాలు అప్రమత్తం కావాలని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలలో వంట నూనెలలో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న ఈ వంట నూనెలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నాయని గుర్తించారు. వంటనూనెల ధరలు పెరగడంతో కల్తీలు పెరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కల్తీ నూనెలను అరికట్టే చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనట్లు పేర్కొన్నారు. మిల్లులలో ఇతర నూనెల మిక్సింగ్ చేస్తున్నారని, వాటిపై రాష్ట్రాలు దృష్టిపెట్టారని సూచించింది.  అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కల్తీ పూర్తిస్థాయిలో ఫుడ్ సేఫ్ ఇన్స్పెక్టర్ లను   నియమించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆ సంస్థ సూచించింది. హోటల్స్, వంట నూనెల తయారీ  కేంద్రాలలో తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా ఉంచాలని కోరింది. వంట నూనెల ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్న అక్రమార్కుల విషయంలో జాగర్తగా ఉండాలని కోరింది. వివరాలు లేనిప్యాకెట్లను  గుర్తించి వాటిపైన రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వంట నూనెలు తయారు చేస్తున్న సంస్థల వివరాలు, ప్యాకింగ్ చేసిన తేదీ, ప్లాంట్ వివరాలు, అందులో కలిపిన కెమికల్స్ వంటి వివరాలుతో కూడిన ప్యాకెట్లను ప్రజలు కొనుగోలు చేయడం వారి ఆరోగ్యానికి మంచిది. వేరుశనగ గింజలను తీసుకోని నూనె అడించుకోవడం అన్నిటి కంటే మంచిది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *