1, మే 2023, సోమవారం

చిత్తూరు TDP టిక్కెటు దక్కేది ఎవరికీ ?

చిత్తూరు TDP టిక్కెటు దక్కేది ఎవరికీ ?

రెడ్డి సామాజిక వర్గం నుండి CK బాబు

బలిజలలో బాలాజీ, హేమలత, తేజశ్వరి

కమ్మ నుండి జయప్రకాశ్, చంద్ర ప్రకాష్, వసంత్ కుమార్ 


                          రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా  చిత్తూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ సీటుకు గట్టిపోటి నెలకొంది. చిత్తూరు ఎమ్మెల్యే స్థానాన్ని పలువురు ఆశిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టిక్కెట్టును దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తాము వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బంధుమిత్రుల ద్వారా కూడా అధిష్టానాన్ని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని జనరల్ కు కేటాయించడంతో బలిజ, రెడ్డి, కమ్మ కులస్తులు భారీగా పోటీ పడుతున్నారు.

                 చిత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచిన CK బాబు (CK Babu) ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీలో చేరినా, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పర్యాయం సీకే బాబు చిత్తూరు నుండి మరోసారి తన అదృష్టాన్ని  పరీక్షించు కోవాలని అనుకుంటున్నారు. సీకే బాబుకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అనంతపురంకి చెందిన మరో పార్టీ ప్రధాన కార్యదర్శి దీపక్ రెడ్డి,  తిరుపతికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి మద్దతిస్తున్నారు. అయితే రవిశంకర్ చౌదరి హత్య కేసు నేపాధ్యంలో చిత్తూరుకు చెందిన కమ్మ నాయకులు సీకే బాబుకు టికెట్ విషయంలో గట్టిగా అడ్డుపడుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలన్నా కూడా కమ్మ వర్గం అడ్డుపడినట్లు తెలుస్తోంది.

              


                     తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ తెలుగుదేశం పార్టీ టికెట్లను ఆశిస్తున్నారు. ఆయన తమ్ముడు రాజేష్ తెలుగు యువత పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కాజూరు బాలాజీ చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కరోనా సమయము నుంచి నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకొని, పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. నియోజకవర్గం మొత్తం కరోనా నివారణ మందులను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు పర్యటనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

                


                   చిత్తూరు కార్పొరేషన్ మేయర్ గా పని చేసిన కటారి హేమలత (Katari Hemalatha) చిత్తూరు టికెట్ ను ఆశిస్తున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. మామ కటారి మోహన్క, అత్త  కటారి అనురాధ  రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేతలు. కటారి మోహన్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అత్త కటారి హేమలత చిత్తూరు మేయర్ గా చేశారు. వారి వారసత్వం పునిచ్చిపుచ్చుకున్న హేమలత నగర పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ, సమస్యల పైన, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భర్త కటారి ప్రవీణ్ మరణించినా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆమె ఒక విధంగా రాజకీయాలలో ఒంటరి పోరాటం చేస్తున్నా, ఎక్కడ రాజీ పడడం లేదు. తన అనుచరుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడంతో పోలీసు జీప్ కు అడ్డంగా పడుకోవడంతో పోలీసులను కాలు మీద జీపును కూడా ఎక్కించారు. అయినా వెరవకుండా ప్రజా వ్యతిరేక సమస్యల మీద పోరాటం సాగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.

                  


                  చిత్తూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన చంద్ర ప్రకాష్ (Chandra Prakash) కూడా ఈ పర్యాయం చిత్తూరు టిడిపి టికెట్ రేసులో ఉన్నారు. చంద్ర ప్రకాష్ సతీమణి గీర్వాణి జిల్లా పరిషత్తు చైర్మన్ గా పనిచేశారు. పారిశ్రామికవేత్తగా, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న చంద్ర ప్రకాష్ గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనకు చిత్తూరు మండలంలో గట్టి పట్టు ఉంది.

          


    దివంగత DK ఆదికేశవులు, DK సత్య ప్రభల కుమార్తె తేజేశ్వరి (DK Thejeswari) కూడా ఈ పర్యాయం ఎమ్మెల్యే టికెట్ ద్వారా రాజకీయ ప్రవేశం చేయాలని అకుంటున్నా.రు తండ్రి డీకే ఆదికేశవులు, తల్లి డీకే సత్యప్రభ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఉన్న తేజేశ్వరి తల్లి, తండ్రి ఎన్నికల్లో పోటి చేసినపుడు పార్టీ తరఫున ప్రచారం చేశారు. గుడిపాల మండల ఇన్చార్జిగా ప్రచార బాధ్యతలను నిర్వహించారు. బలిజ సామాజిక వర్గం కింద ఆమె టిక్కెట్ ను ఆశిస్తున్నారు.

                 


                     బంగారుపాల్యం  మండలానికి చెందిన NPS జయప్రకాష్ (NPS Jayaprakash) కూడా చిత్తూరు అసెంబ్లీ టికెట్ రేసులో ఉన్నారు. ఆయన తండ్రి NP భాస్కర్ నాయుడు దశాబ్ద కాలం పాటు CDCMS చైర్మన్ గా పనిచేశారు. NPS జయప్రకాష్ బంగారు పాల్యం మండల పరిషత్ అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర TDP కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి కూడా బంగారుపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న తనకు టికెట్ కేటాయించాల్సిందిగా జయప్రకాశ్ అధిష్టానాన్ని కోరుతున్నారు.

          


                            చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ (Vasantha kumar) కూడా చిత్తూరు టిడిపి టికెట్ రేసులో ఉన్నారు. ఆయన ఇటీవల తన జన్మదిన సంబరాలను  భారీ ఎత్తున నిర్వహించి తను కూడా పోటీలో ఉన్నట్లు తెలియజేశారు. TDP జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.  కమ్మ సామాజిక వర్గం నుంచి వసంత్ కుమార్ కూడా టిక్కెట్లు ఆశిస్తున్నారు


                   చిత్తూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి సామాజిక వర్గం నుంచి సీకే బాబు, బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత, డీకే తేజేశ్వరి రంగంలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్ర ప్రకాష్, NPS జయప్రకాష్, వసంత కుమార్ టికెట్టును ఆశిస్తున్నారు.  చిత్తూరు అసెంబ్లీ టికెట్ వీరిలో ఎవరిని వరిస్తుందో వేసి చూడాల్సిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *