15, మే 2023, సోమవారం

నగరిలో రోజాను ''ఢీ'' కొనే ధీరుడెవ్వరు?

నగరిలో రోజాను ''ఢీ'' కొనే ధీరుడెవ్వరు?



                         చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ రాజకీయ పరిస్థితిపై జిల్లా రాజకీయాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాష్ట్ర పర్యాటక మంత్రి, ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజాకు సొంత పార్టీ లోనే వ్యతిరేకత ఉన్నందున ఈ సారి టిక్కెట్టు రాదనే వారు ఉన్నారు. అయితే చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న ఆమెకే జగన్  టిక్కెట్టు ఇస్తారని, తిరిగి గెలుస్తారని ఆమె వర్గీయులు అంటున్నారు. అలా అని TDP అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విషయంలో కూడా కుటుంబ సభ్యులలో ఏకాభిప్రాయం లేదు. సొంత కుటుంబ సభ్యులు గాలి భాను ప్రకాష్ కు మద్దతుగా నిలువడం లేదు. టిడిపి అభ్యర్ధిగా ఇంచార్జి గాలి భాను ప్రకాష్ కే అవకాశం ఉంటుదని, ఆయన గెలుపు ఈ సారి నల్లేరు మీద నడకే అని పలువురు అంటున్నారు. అయితే అయనను తల్లి సరస్వతీ, తమ్ముడు జగదీష్ ఓడిస్తారని వాదించే వారు కూడా ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని చిన్న కొడుకుడు గాలి జగదీష్ కూడా ఆశిస్తున్నారు. రానున్న ఎన్నికలలో పోటి చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

                                           

                     ఈ సారి గొత్త అభ్యర్థిని రంగంలోకి దింపి అవకాశం ఉందని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తగిన అభ్యర్థిని బరిలోకి దింపి రోజాను ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు. దీనికోసం మూడు పేర్లతో ఒక జాబితా ఇవ్వాలని రాబిన్ శర్మ టీమ్ ను కోరినట్టు తెలిసింది. దీంతో వారు తొలి నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలపై పార్టీలు, కులాల ప్రభావం విశ్లేషించి అభర్ధుల పేర్లు చూపించినట్టు సమాచారం. 1952 నుంచి 2009 వరకు తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికల్లో ఆరు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు టిడిపి, ఒక సారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సామాజిక వర్గాల ప్రకారం నాలుగు రెడ్లు, మూడు సార్లు రాజులు, రెండు సార్లు కమ్మ వారు గెలుపు సాధించారు. 


                  కాంగ్రెస్ లో రెండు సార్లు గెలిచిన కిలారి గోపాల్ నాయుడు ఒకసారి, నాలుగు సార్లు గెలిచిన రెడ్డివారి చెంగా రెడ్డి  మూడు సార్లు మంత్రిగా పని చేశారు. అలాగే టిడిపిలో ఒక సారి గెలిచిన ఇ వి గోపాల రాజు నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో నెలరోజులు పదవిలో ఉన్నారు. నియోజక వర్గాల పునర్విభజన తరువాత 2009 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగా రెడ్డిపై 1308 ఓట్ల మెజారిటీ సాధించారు. ముద్దు కృష్ణమ నాయుడు అంతకు ముందు ఐదు సార్లు పుత్తూరు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. 

                                      

                 2014 ఎన్నకల్లో వైసిపి అభ్యర్థి రోజా టిడిపి అభర్ధి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై 858 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తిరిగి వైసిపి టిక్కెట్టుపై పోటీ చేసిన రోజా టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ పై 2708 ఓట్ల ఆధిక్యం సాధించారు. జగన్ మంత్రి వర్గ మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు పర్యాటక శాఖ అప్పగించారు. ఈ పరిస్థితులను విశ్లేషిస్తే ఈ నియోజక వర్గం టిడిపికి, కమ్మ సామాజిక వర్గం వారికి అంత అనుకూలం కాదని రాబిన్ శర్మ టీమ్ తేల్చి వేసిందని తెలిసింది. భాను ప్రకాష్ కు తన తల్లి మాజీ ఎమ్మెల్సీ సరస్వతి, తమ్ముడు గాలి జగదీష్ వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఆయన మరింత పనిచేయాలని సూచించారని అంటున్నారు. 2014 ఎన్నకల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన గాలి భాను ప్రకాష్ వైపే TDP అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. TDP జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా నగరి TDP అభ్యర్థిగా గాలి భాను ప్రకాష్ ను ప్రకటించారు. గాలి భాను ప్రకాష్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

                       అయితే  గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ కూడా తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఆశిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇటివల ముస్లింలకు రంజన్ తోఫా పంపిణి చేశారు. తండ్రి వర్ధంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. విజేతలకు లక్ష రూపాయలు బహుమతిగా ప్రకటించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి, మాజీ MLC గాలి సరస్వతీ కూడా చిన్న కొడుకు జగదిష్ కు  అండగా ఉన్నారు. సోదరీలు కూడా అండగా ఉన్నారు. జగదీష్ మామ కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు కర్ణాటకలో BJP ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆర్థికంగా బాగున్నారు. జగదీష్ కూడా TDP టిక్కెట్టును ఆశిస్తున్నారు. టిక్కెట్టు ఇవ్వకుంటే, వేరే పార్టీ తరఫున అయినా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు.

             ఆయనతో పాటు సిద్దార్థ విద్యా సంస్థల అధిపతి ఎ అశోక రాజు పేరు జాబితాలో చేర్చారని తెలిసింది. అశోక్ రాజు గతంలో చంద్రబాబు PAగా పని చేశారు. 2014 ఎన్నికలలో TDP టిక్కెట్టును ఆశించారు. కాగా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్ధి అయితే మరింత మంచి ఫలితాలు ఉన్నాయని భావిస్తున్నట్టు సమాచారం. దీని కోసం మాజీ మంత్రి రెడ్డి వారి చెంగా రెడ్డి కూతురు ఇందిరా స్వరూప పేరు పరిశీలిస్తున్నారని అంటున్నారు. కాగా ఐఐటి ఉద్యోగం చేస్తున్న ఒక రెడ్డి యువకుని పేరు కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *