చిత్తూరు టైగర్ CK బాబు
చిత్తూరు టైగర్ CK బాబు
చిత్తూరు రాజకీయాలలో సీకే బాబు ఒక సూపర్ స్టార్. ఒక తిరుగులేని నేత. చిత్తూరు కింగ్ గా చలామణి అయ్యారు. అభిమానులందరూ చిత్తూరు టైగర్ గా పిలుచుకుంటారు. ఒకనాడు CK బాబు అంటే చిత్తూరు, చిత్తూరు అంటే సీకే బాబు. చిత్తూరు జిల్లా రాజకీయ రంగంలో చక్రము తిప్పిన ధీరుడు CK బాబు. చిత్తూరు మాత్రమే కాకుండా వేపంజేరి, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గం ఆయన ప్రాభల్యం ఉంది. ఆయనకు అనుచరుగణం ఉంది. ఆయన రాజకీయాలలో లేకున్నా, చెరగని ప్రభ సీకే బాబుది. ఇప్పటికీ ఆయనకు పలు నియోజకవర్గాలలో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఉన్నారు. సీకే బాబు వస్తున్నారంటే ఆయనను చూడడానికి ఒక సినిమా స్టార్ లాగా జనం ఎగబడతారు. ఆయనతో కరచాలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీలు పడతారు. ఆయన దృష్టిలో పడడానికి శ్రమిస్తారు. పీకే బాబు రాజకీయాల్లో ఉన్న లేకున్నా ఒక క్రేజీ నాయకుడు.
CK Babu PVKN డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేశారు. చిత్తూరు కౌన్సిలర్ గా సీకే బాబు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడుగా ఉంటూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. చిత్తూరులో ఈ రికార్డు ఏ నాయకుడికి లేదు. 1989 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున గోపీనాథ్, టిడిపి తరఫున హరి ప్రసాద్ లను ఓడించి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 1994, 1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిడిపి అభ్యర్థి ఏఎస్ మనోహర్ మీద విజయం సాధించారు. 2004 ఎన్నికలలో ఏఎస్ మనోహర్ చేత ఓటమిపాలయ్యారు. తిరిగి 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు, టిడిపి అభ్యర్థి బాలాజీ నాయుడు మీద విజయం సాధించారు.
TDP మహిళా నేత YV రాజేశ్వరి కుమారుడు రవి శంకర చౌదరి హత్య కేసులో 2003 జూన్ 16న సీకే బాబు శాసనసభ్యుడు హోదాలో అరెస్టయ్యారు. ఆయన కొంతకాలం కారాగార జీవితాన్ని గడపాల్చి వచ్చింది. అనంతరం ఆ కేసును కోర్టు కొట్టు వేయడంతో తిరిగి రాజకీయాలలో చురుగ్గా పాల్గొనాలని భావించారు. 2014 తారీఖున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ఆహ్వానం మేరకు ఆయన చేరారు. పార్టీలో చేరినా, ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో CK బాబుకు రాలేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు విజయానికి CK Babu కృషి చేశారు. వైయస్సార్ పార్టీలో కొంతకాలం కొనసాగారు.
అనంతరం 2017 నవంబర్ మూడవ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్యర్యంలో బెంగళూరులో బిజెపిలో చేరారు. BJP నేత పురందేశ్వరి సహకరించారు. కొద్ది నెలలు పార్టీలో ఉన్నారు. BJP ముస్లిం వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నుండి వెలుపలికి వస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త విరామం తరువాత 2019 మార్చి 22వ తారీఖున TDP అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం దేశం పార్టీలో కొనసాగుతున్న పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన సీకే బాబు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పోస్టు ఆశించారు. అలాగే టికెట్ ఖరారు చేస్తూ నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇవ్వాలని కోరారు. స్థానికంగా కొంతమంది కమ్మ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అది కార్యరూపం దాల్చలేదు. రానున్న ఎన్నికలలో సికే బాబు చిత్తూరు నియోజకవర్గ టిడిపి టికెట్ ను ఆశిస్తున్నారు. టిడిపి ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, అధికార ప్రతినిధి NB సుధాకర్ రెడ్డిలు సీకే బాబుకు సపోర్ట్ చేస్తున్నారు.
భారతీయ జనతా సీకే బాబు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీలో చేరి మళ్లీ వెలుపలికి వచ్చిన సీకే బాబు పట్ల బిజెపి నాయకులు సానుకూలంగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. ఆయన సన్నిహితుడుగా మెలిగిన CK బాబుకు మళ్లీ బిజెపిలో అవకాశం రావచ్చని భావిస్తున్నారు. జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు అందరూ సీకే బాబు విషయంలో ఒక్కటి అవుతున్నారు. జిల్లా కేంద్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఒకరు అధికారంలో ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు గాను పార్టీలకు అతీతంగా సీకే బాబును బలోపేతం చేయడానికి, రానున్న ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్తూరు గంగ జాతర అనంతరం సీకే బాబు రాజకీయం పైన ఒక ప్రకటన ఉండవచ్చని అభిమానులు ఎదురుచూస్తున్నారు.