YCPకి SCV గుడ్ బై ?
ఎన్నికలలో పోటికి SCV రెడీ
టిక్కెట్టు రాకుంటే YCPకి గుడ్ బై
ఇండిపెండెంట్ గా బరిలోకి
శ్రీకాళహస్తి రాజకీయం కాక రేపుతోంది. ఎన్నికలకు ముందే రాజకీయ ముఖచిత్రం మారుతోంది. భారీగా రాజకీయ మార్పులు చోటుచేసు కుంటున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి శ్రీకాళహస్తి మాజీ MLA ఎస్ సి వి నాయుడు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో నాయుడుకు గట్టి పట్టు ఉండటంతో రాజకీయ సంచలనానికి తెర లేచింది. టిక్కెట్ విషయంలో ఈ పర్యాయం జగన్ తో అమీ తుమీ తేల్చుకోవాలని అనుచరులు వత్తిడి చేస్తున్నారు. తనకు ఈ పర్యాయం శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని SCV Naidu గట్టిగా కోరుతున్నారు. అధిష్టానం తగిన విధంగా స్పందించకపోతే పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగు దేశం పార్టీ లేక జనసేన పార్టీలా నుండి పోటి చేయాలని అనుచరులు వత్తిడి చేస్తున్నారు. అలా కుదరని పక్షంలో ఇండిపెండెంట్ గా సైతం పోటీ చేయడానికి సిద్దం కావాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎస్వి నాయుడు అనుచరులు ఆయన మీద బలంగా ఒత్తిడి తెస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో అధిష్టాన వర్గం మీద SCV నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు.
శ్రీకాళహస్తికి చెందిన SCV నాయుడు 2004 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2009 ఎన్నికల్లో కూడా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేశారు. రెండవ సారి SCV నాయుడు ఓటమిపాలయ్యారు. దీనితో కాంగ్రెస్ పార్టీలో నుండి అధికార తెలుగుదేశం పార్టీలో చేరి, సత్యవేడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పనిచేసారు. 2014 ఎన్నికలలో ఆయన శ్రీకాళహస్తి టిడిపి టికెట్ ను ఆశించారు. టిడిపి టిక్కెట్టును బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి దక్కింది. కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్న SCV నాయుడు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే MLC ఇస్తామని పార్టీ అధినేత జగన్, జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి ఎస్ సి వి నాయుడుకు హామీ ఇచ్చారు. ఎస్ సి వి నాయుడు పార్టీ కోసం పనిచేస్తున్నా, చివరి నిమిషంలో ఎమ్మెల్సీని శ్రీకాళహస్తికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యంకు ఇచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి YCPలో చేరిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఇవ్వడంSCV అనుచరులకు మింగుడు పడటం లేదు. ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో ఈ పర్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఇవ్వాల్సిందిగా నాయుడు కోరుతున్నారు.
తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇవ్వకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎస్ సి వి నాయుడుకు ఇక్కడ కూడా మళ్లీ చేదు అనుభవం ఎదురయింది. ఎమ్మెల్సీ ఇస్తామని చివరి నిమిషంలో సిపాయి సుబ్రహ్మణ్యంకి ఇవ్వడంతో ఆయన అనుచరగణం అసంతృప్తిగా ఉన్నారు. ఈ పర్యాయం ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేసి అమీ తుమీ తేల్చుకోవాలని SCV నాయుడు మీద అనుచరులు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాయుడు కూడా ఈ పర్యాయం ఎన్నికల బరిలో దిగడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో సిట్టింగులకు సీటు ఇవ్వాలని అధిష్టానం భావిస్తే మరోసారి వైయస్సార్సీపి టికెట్ బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఖరారు అవుతుంది. ఇదే జరిగితే ఎస్సివి నాయుడు పార్టీ నుండి వెలుపలికి వచ్చి అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఈ పర్యాయం కూడా టిడిపి టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి పనితీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంత సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ లేక జనసేన పార్టీలు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పోటీ చేయాల్సిందిగా SCV నాయుడు అనుచరులు ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇరు పార్టీలు టిక్కెట్టు ఇవ్వకపోయినా, ఇండిపెండెంట్ గా తన సత్తా చూపాలని కోరుతున్నారు. మాజీ ముక్యమంత్రి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా SCV నాయుడుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయన BJPలో చేరారు.కిరణ్ నుండి కూడా పిలుపు రావచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికలలో ఇండిపెండెంట్ లను ఆదరించిన చరిత్ర శ్రీకాళహస్తికి ఉందని, కావున ఇండిపెండెంట్ గా పోటీ చేసే అయినా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుచర వర్గం గట్టిగా డిమాండ్ చేస్తుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్ సి వి నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వేసి చూడాల్సిందే.