8, మే 2023, సోమవారం

గంగాధర నెల్లూరు తెదేపా టిక్కెట్టు విజేత ఎవరు?

   గంగాధర నెల్లూరు తెదేపా టిక్కెట్టు విజేత ఎవరు? 


                       గంగాధర నెల్లూరు నియోజక (SC రిజర్వుడ్) నియోజక వర్గంలో ఎలాగైనా టిడిపి జండా ఎగుర వేయాలని ఆ పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం రూపొందిస్తున్నారు. డిప్యూటి సిఎం కళత్తూరు నారాయణ స్వామిని ఓడించడానికి  తగిన అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. నియోజక వర్గాల పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు పార్టీ ఓడిపోయింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కుతూహలమ్మ 10 వేల మెజారిటీతో విజయం సాధించింది. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ టిక్కెట్టుపై నాలుగు సార్లు  వేపంజేరి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆమెను టిడిపి అభ్యర్ధిగా బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి నారాయణ స్వామి ఆమెపై  20 వేల మెజారిటీ సాధించారు. అలాగే 2019 లో ఆమె కుమారుడు డాక్టర్ ఆనగంటి హరికృష్ణ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి నారాయణ స్వామి చేతిలో 45 వేల తేడాతో ఓడి పోయారు.           

  

     

            ఇక్కడ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు 55 శాతం పైగా ఉన్నందున టిడిపి అభ్యర్థులు గెలవలేక పోతున్నారని బాబు గుర్తించారు. దీనితో చంద్రబాబు పెనుమూరు మండలానికి చెందిన డాక్టర్ NB సుధాకర్ రెడ్డిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అలాగే పాలసముద్రంకు చెందిన భీమినేని చిట్టిబాబు నాయుడును నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారు. అయితే తనకు తెలియకుండా సమన్వయ కర్తను నియమించడంతో మనస్తాపం చెందిన గుమ్మడి హరికృష్ణ ఇంచార్జి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డిని గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిశీలకునిగా నియమించారు. అయితే ఇప్పటికీ బలమైన ఎస్సీ నాయకుడు దొరకక పోవడంతో ఇంచార్జిని నియమించ లేదు. 

        


                   ఎన్నికలు సమీపిస్తుండం, TDP గాలి వీస్తుండడంతో ఇన్ ఛార్జ్ బాధ్యత తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో  డాక్టర్ థామస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కార్వేటినగరం మండలం అల్లా గుంటకు చెందిన ఆయన చెన్నైలో సంతనలేమి ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నారు. 
 సుమారు 50 వేల మంది దంపతులకు సంతానాన్ని చికిత్స  ద్వారా కలుగ చేసారు. ఇందులో  గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సుమారు 3,000 మంది ఉంటారు. నియోజక వర్గంలో 30 వరకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. థామస్ తండ్రి కట్టెల వ్యాపారం చేసేవారు. నియోజకవర్గంలో ఆయనను తెలియని వారు లేరు. తమిళ క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన  థామస్ తమిళ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. నియోజకవర్గ మొత్తం పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. అన్నిటికి మించి ఆర్థిక స్తోమత ఉండటంతో టిక్కెట్ రేసులో ఆయన ముందున్నారు.

          


  
                వెదురుకుప్పం మండలానికి చెందిన డాక్టర్ రవికుమార్ పుత్తూరులో గ్యాస్ ఏజెన్సీ నడుపుతున్నారు. పచ్చికాఫలం గ్రామానికి చెందిన రవికుమార్  గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కోశాధికారిగా పని చేశారు ఆయన చిన్నాన్న కూతురు కర్ణాటకలోని బళ్లారి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన M. Phil, Ph.D, Law  చేసి చురుగ్గా ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటూ 15 అవార్డులు సాధించారు. నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్న ఆయన టిక్కెట్లను ఆశిస్తున్నారు.

              


                    పాలసముద్రానికి చెందిన మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు, మాజీ ZPTC సభ్యుడు రాజేంద్రన్ కూడా ఈ పర్యాయం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారు. ఆయన ZPTC సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రికార్డు సృష్టించారు. SV యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా పని చేశారు. జిల్లా పరిషత్తు ఆర్థిక, విద్యా కమిటీ సభ్యుడిగా ఉండినారు. నియోజకవర్గ అసైన్మెంట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. గతంలో చార్మినార్ నియోజకవర్గ పరిశీలకుడుగా కూడా పనిచేశారు. మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న రాజేంద్ర తనకు టికెట్ ఇస్తే ఈసారి కచ్చితంగా గెలుస్తామని వ్యక్తం చేస్తున్నారు.

                      


              కార్వేటినగం మాజీ వైస్ ఎంపిపి టి రవి కుమార్ కూడా టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఆయన ఇటుకలు, రియల్ ఎస్టేట్, మామిడి వ్యాపారం చేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కార్వేటినగరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ప్రజలతో మమేకమయ్యారు. వెదురు కుప్పం,  పాలసముద్రం,  SR పురం మండలాల్లో బలమైన బంధుగణం ఉంది. కార్వేటి నగరం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ  కళాశాల చైర్మన్ గా పనిచేసిన రవికుమార్ కు శిష్యగణం, స్నేహితులు భారీగా ఉన్నారు.

                     


                      పెనుమూరుకు చెందిన  మాజీ ఎమ్మెల్యే తలారి రుద్రయ్య కుమారుడు తలారి రెడ్డెప్ప కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. 
ఆయన తండ్రి తలారి రుద్రయ్య శాసనసభ్యుడిగా పనిచేశారు. 6 సంవత్సరాలు పాటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. MPTC సభ్యులుగా గెలుపొందారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి  తీసుకెళ్తూ, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా, ఉంటూ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మాదిగలకు టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. వైసిపికి చెందిన ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్టు ఇస్తే పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *