అట్టహాసంగా చిత్తూరు గంగ జాతర
అట్టహాసంగా ప్రారంభం అయిన చిత్తూరు గంగ జాతర
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త, చిత్తూరు మాజీ MLA CK బాబు తన సతీమణి పీకే లావణ్యతో కలిసి మంగళవారం వేకువ జామున గంగమ్మకు తెర తొలగించారు. అనంతరం గంగమ్మకు తొలి పూజను నిర్వహించారు. తొలి పూజను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ పర్యాయం గంగమ్మ బంగారు వర్ణముతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బంగారు నగలతో, విద్యుత్ దీపాల అలంకరణతో నడి వీధి గంగమ్మ వెలిగిపోతోంది. భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. అమ్మ వారిని ఎంత సమయం చూసినా, మళ్ళి, మళ్ళి చూడాలనే సౌందర్యంతో అలరాలుతోంది. భక్తులకు అభయప్రదానం చేస్తోంది.
పరిసర ప్రాంతంలో మరో 10 గంగమ్మ జాతర మండపాలు చేశారు. గిరింపేట, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, సంతపేట, ఓబనపల్లి, ఓబనపల్లి కాలని, మంగసముద్రం, దొడ్డిపల్లి, మురకంబట్టు లలో కూడా గంగమ్మలు కొలువుతీరారు.
గంగ జాతరకు పారిశుద్ధ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ వంతు సేవలు నిర్వహించారు. గంగమ్మకు ఎదురుగా ఏర్పాటుచేసిన పెనాలలో భక్తుల అంబల్ల సమర్పించగా ఈ అంబళ్లు కిందపడి ప్రవాహం ప్రవహించాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు.
పొరపాటున ఎవరైనా పిల్లలు తప్పిపోయిన పోలీసులు వారి చేతికి ఉండే ట్యాగ్ సహాయంతో వారి తల్లితండ్రుల చెంతకు సులబంగా చేర్చుతారు. పట్టణం అంతట జాతర జరుగుతున్న సమయం కనుక అంతటిని ఒకే చోట వీక్షించే విధంగా చిత్తూరు పట్టణము నడిబొడ్డు లో గాంధీ విగ్రహం వద్ద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎస్.ఐ., సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేసారు. అంతేకాకుండా జాతర ప్రదేశాలలో మైకులు అమర్చి మైకులను ఈ ఇంటిగ్రేటెడ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసందానించి పర్యవేక్షిస్తామని తెలిపారు.
చిత్తూరు గంగమ్మ జాతర వేడుకలు పురస్కరించుకొని 600 మంది సిబ్బందితో బారి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన తనిఖిలు 05 చెక్ పోస్టులు, 14 పికట్లు, 04 రక్షక్ మొబైల్స్, 08 బ్లూ కోట్ మొబైల్స్ 24 గంటలు తనిఖిలు నిర్వహిస్తారు. బజారు వీధిలో జరుపు నడి వీధి గంగమ్మ తో పాటుగా పట్టణ పరిసర ప్రాంతంలో మరో 10 గంగమ్మ జాతర మండపాలు అనగా గిరింపేట, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, సంతపేట, ఓబనపల్లి, ఓబనపల్లి కాలని, మంగసముద్రం మొదలగు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న క్రమంలో పోలీసు శాఖ అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం వేడుకుల విషయములు, మండపాల ప్రాంగణాలలో జరుగు అన్ని విషయములు ఒక SI స్థాయి అధికారి, సిబ్బంది తో పర్యవేక్షించడం జరుగుతుంది. దొంగతనాలు అరికట్టుట కోసం ప్రత్యేకమైన టీం లు ఏర్పాటు చేశారు. గుడి ప్రాంగణం, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా CCTV లు ఏర్పాటు చేశారు.
పోలీసు ఆద్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను మొట్టమొదటి సారిగా అన్ని డిపార్ట్మెంట్ల కలయికతో “ Integrated Police Control Room” ను PCR జంక్షన్ వద్ద ఏర్పాటు చేయడమైనది. Integrated Police Control Room నుండి భక్తులు పాఠించవలసిన సూచనలు, సలహాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నియు బజారు వీధి, చర్చి వీధి, పోన్నియమ్మన్ కోయిల్ వీధి, హై రోడ్డు అనగా బజారు వీధి గంగమ్మ నాలుగు మాడ వీధులలో ఒకే అనౌంన్స్మెంట్ ద్వారా తెలిచేయుటగాను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడమైనది.
Police Sevadal అను నూతన కార్యక్రమం ద్వారా వృద్దులకు, పిల్లలకు, ఆడవారికి పోలీసు శాఖ యొక్క మహిళా పోలీసు వారి సహకారంతో వారికి చేదోడువాదోడగా ఉండడం జరుగుతుంది. రెండు రోజులు పండుగ వాతవరణం, రద్ది ఉండడం వల్లన పెద్ద పెద్ద వాహనాలు చిత్తూరు పట్టణం లోపలకి రాకుండా నిలిపివేస్తున్నారు. 17.05.2023 వ తేది EMCET పరిక్షలు ఉన్న విద్యార్థులు, వారి ప్రయాణాలకు సంబందపడి సొంత ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.ఎవరికైన ఏదైన అసౌకర్యం కలిగిన యెడల PCR జంక్షన్ వద్ద ఉన్న Integrated Police Control Room వద్దకు వచ్చి పోలీసు వారి సహాయం పొందవచ్చాన్నారు. జాతర రద్దీ దృష్ట్యా కార్స్ మరియు 4 wheelers జాతర పరిసరప్రాంతాలు అనగా MSR సర్కిల్ , PCR సర్కిల్, Udipi సర్కిల్, కట్టమంచి రైల్వే అండర్ బ్రిడ్జి చుట్టుపక్కల అనువతించడం లేదు.
గంగమ్మ మండపాలకు వెళ్ళు భక్తులు ఎక్కడ పడితే అక్కడ వారి వాహనాలు పార్క్ చేయరాదు, పోలీసు వారు నిర్దేసించిన పార్కింగ్ స్థలములో వాహానాలను పార్క్ చేసుకోగలరు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వాహనములు వురి అవతలి పార్కింగ్ చేసుకోగలరు. ఎవరైన కొత్త వ్యక్తులు మీ యొక్క కాలనీలలో, వీధులలో అనుమానంగా తిరుగుతుంటే వెంటనే Dial 100 ద్వారా తెలుపుగలరు. 17.05.2023 వ తేదిన గంగమ్మ నిమజ్జణం జరుగు సమయంలో ప్రజలు భారి సంఖ్యలో వేడుకలలో పాల్గొనడం జరుగుతుంది. కావున దొంగతనాలు జరుగు అవకాసం ఉన్నందున ఆడవారు బంగారు నగలు ధరించి వేడుకులకు రావద్దని వారి విలువైన వస్తువులు, సెల్ ఫోనులు, పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని పోలీస్ వారు కోరడమైనది. మద్యం సేవించి పబ్లిక్ న్యూసెన్స్ చేయవారు, అల్లరి మూకలు, గొడవలు చేయువారిపై కఠినమైన చర్యలు తీసుకోబడును. 30 Police Act అమలులో ఉన్నందున ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిషేదించడమైనది, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చిత్తూరు DSP శ్రీనివాసమూర్తి తెలిపారు.