26, మే 2023, శుక్రవారం

రాజకీయాలలో ఒక ప్రభంజనం TDP

రాజకీయాలలో ఒక  ప్రభంజనం  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం

రాజమహేంద్రవరంలో మే 27, 28 మహానాడు సందర్భంగా  



                     " సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు" అంటూ తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party). యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేసిన తెలుగుదేశం పార్టీ. నాటి నుండి అప్రతిహతంగా నాలుగు దశాబ్దాలుగా జనజీవితంతో కలిసి ప్రయాణిస్తోంది. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌, పేదవాడికి పక్కా ఇల్లు... ఇలా ఎన్నో పథకాలతో దేశంలోనే ప్రజలకు సంక్షేమ పాలనను అందించిన మొదటి పార్టీగా TDP ప్రజల గుండెల్లో నిలిచింది. నిబద్ధత, నిజాయితీ, నిర్భీతి, నిక్కచ్చితనం కలబోసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా మార్చారు.




                  "తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలిరా!" అని అన్నగారు పిలిచిన పిలుపు ప్రభంజనమై... ఆ హోరుగాలిలో బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయింది. పార్టీగా ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ప్రాభవం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. జనవరి 9, 1983 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా, తనను ఎన్నుకున్న లక్షలాది మంది ప్రజల సమక్షంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో  ఎన్టీఆర్ తన 15 మంది మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటివరకు ఎన్నికైన ఒక ప్రజానేత బహిరంగ ప్రమాణ స్వీకారం చేయడం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రప్రథమం. 



                   పసివాడి నుండి పండు ముదుసలుల వరకు ఎన్టీఆర్ ను "అన్నగారు" అంటూ సంభోదించారు. అది ఆయనకు దేవుడిచ్చిన వరం. "చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... గతమెంతో ఘనకీర్తి కలవోడా... " అంటూ చైతన్యరథం కదిలి వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు. జనవరి 5, 1983న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో... కొత్తవారైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మహా మహా ఉద్దండులను సహితం మట్టి కరిపించి విజయం సాధించారు. వీరిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉండటం విశేషం. మహిళలని, బడుగు వర్గాల వారిని, వెనుకబడిన వర్గాల వారినీ గెలిపించి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. 292 స్థానాలకు గాను 202 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 60 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ గెలిచింది.




                         నాటి దివిసీమ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయారు ఎన్టీఆర్. మూడు దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి, వెండితెర వేలుపుగా పూజించి... విశ్వవిఖ్యాతుని చేసిన ప్రజలకు, ఏదైనా మంచి చేసి వారి ఋణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపు చెరలో తెలుగువారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది. ఒక తెలుగుబిడ్డగా తెలుగువాడి తేజం ఏంటో ప్రపంచానికి చూపించాలంటే... తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యం అని భావించారు ఎన్టీఆర్.



                        ఫలితంగా 1982 మార్చి 29న మద్యాహ్నం 2.30 లకు హైదరాబాద్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సభ జరిపి 'తెలుగుదేశం' పార్టీని ప్రకటించారు. "నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం" అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరి పోశారు. ఏప్రిల్ 11, 1982న తెలుగుదేశం పార్టీ మొదటి బహిరంగ సమావేశం హైదరాబాద్, నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది. మంగళ ప్రదమైన పసుపు రంగుపైన కార్మిక శక్తికి సంకేతమైన ఎర్రని చక్రం, రైతుకి చిహ్నమైన ఆకుపచ్చని నాగలితో పేదల పరిస్థితులను ప్రతిబింభించే తెల్లనైన కుటీరంతో తెలుగుదేశం పతాకాన్ని స్వయంగా తన చేతులతో గీసి రూపొందించారు ఎన్టీఆర్. మే 28, 1982న తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ యావత్ భారతావని దృష్టిని ఆకర్షించింది, ఎన్టీఆర్ ఒక అఖండ శక్తిగా అవతరించగలరని దేశానికి అర్థమయ్యింది.


                              

                    జూన్ 14,1982  తెలుగునాట ప్రతి సామాన్యుడిలో రాజకీయ చైతన్యం కలిగించడానికి చైతన్య రథమెక్కి ప్రచార యాత్రకు కదిలారు ఎన్టీఆర్. కొడుకు హరికృష్ణే రథసారథి. రాత్రి లేదు పగలు లేదు. నటుడిగా తాను సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నిటినీ మరిచి... సామాన్యుడి కోసం నడిరోడ్డుపై నిలిచాడు నందమూరి తారకరాముడు. ఆ రోడ్డే ఆయనకు ఇల్లయ్యింది. తల్లి అయ్యింది. చెట్టు నీడే పడకగది అయ్యింది. మొదటి ప్రచార యాత్ర 20 రోజుల పాటు తెలంగాణలో సాగింది. జూన్ 20న రాయలసీమలో అడుగు పెట్టి... ఆపైన జులై 1 నుండి 5 వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో పర్యటించారు ఎన్టీఆర్.




                     అక్టోబర్ 3, 1982 న రెండవ ప్రచార యాత్రను ప్రారంభించారు ఎన్టీఆర్. నవంబర్ 26, 1982 వరకు 55 రోజుల పాటు జరిగిన ఈ 25 వేల కిలోమీటర్ల ప్రచార యాత్ర నభూతో- నభవిష్యతి. అవిశ్రాంతంగా పర్యటిస్తూ దాదాపుగా 600 సభల్లో ప్రసంగించారు. డిసెంబర్ 16, 1982న మళ్ళీ మొదలైన ఎన్నికల ప్రచార యాత్ర... జనవరి 3, 1983 వరకు నిర్విరామంగా కొనసాగింది. డిసెంబర్ 1982లో ఎన్నికల ప్రచారం సందర్భంగా 72 గంటల పాటు నిద్రాహారాలు మాని నిర్విరామంగా ప్రచారం సాగించి ఎన్టీఆర్ సృష్టించిన చరిత్రను డిసెంబర్ 21 రాత్రి BBC తన వార్తా ప్రసారంలో ప్రపంచానికి చూపించింది. "ప్రపంచంలో ఇంతవరకూ ఎవ్వరూ ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల, ఇన్ని లక్షల ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించ లేదు" అని ఎన్టీఆర్ ని కొనియాడింది. తొలిసారిగా తెలుగువారి ఉనికి, తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది.

     

         

                      1984 ఆగస్టు సంక్షోభం: ఆగస్టు 16, 1984 ప్రజాదరణ మెండుగా కలిగిన ఎన్టీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకపోయిన ఢిల్లీ పెద్దలు కుట్ర పన్ని, అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ను పదవీచ్యుతుని చేసారు. నాదెండ్ల భాస్కరరావు రూపంలో ఎదురైన 1984 ఆగస్ట్ సంక్షోభం ఎన్టీఆర్ పోరాట పటిమకు నిదర్శనమైతే... అదే సందర్భంలో ఎన్టీఆర్ కు అండగా నిలిచిన ఒక సమర్థ యువ నాయకత్వం తెలుగుదేశం పార్టీకి వరమై అందింది. ఆ నాయకత్వం పేరే నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బల నిరూపణ జరిగి, తిరిగి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వరకు చంద్రబాబు చూపిన సమయస్ఫూర్తి, పట్టుదల, యుక్తి ఎన్టీఆర్ ను ఆకర్షించాయి. చంద్రబాబు నాయుడు  శ్రమను గుర్తించి ఆయనను 1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని చేసారు ఎన్టీఆర్. అప్పటి నుండి నేటి వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, తనదైన శైలిలో తీర్చిదిద్ది... ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా పార్టీని నిలిపారు చంద్రబాబు.




                  ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీకి విశ్రాంతి అనేది లేదు. సమసమాజం నిర్మించబడి, పేదరికం లేని ఆనందకరమైన జీవితం ప్రతి తెలుగువాడికి అందించే వరకు జీవనదిలా, నిత్య చైతన్య ప్రవాహంలా చరిత్రను తనలో ఇముడ్చుకుంటూ ముందుకు పోతుంది తెలుగుదేశం. పసుపు అంటే ప్రజలకు శుభాన్ని ఇచ్చేది. పసుపు దళం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేది. తెలుగుదేశం అంటే అప్రతిహత శక్తి ప్రసారిణి. అదే శక్తితో తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. 'యువగళం' పేరుతో నారా లోకేష్ 400 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. నారా చెంద్రబాబు నాయుడు 'ఇదేం ఖర్మ' అంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మే 27, 28 తేదీల్లో జరిగే మహానాడులో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు.  


శాసన సభ ఎన్నికలు

సంవత్సరంసాధారణ ఎన్నికలుగెలిచిన స్థానాలుఓట్ల శాతంఫలితం
19837వ శాసనసభ
202 / 294
54.03%Won
19848వ శాసనసభ
202 / 294
46.21%Won
19899వ శాసనసభ
74 / 294
36.54%ఓటమి
199410వ శాసనసభ
216 / 294
44.14%Won
199911వ శాసనసభ
180 / 294
61.22%Won
200412వ శాసనసభ
47 / 294
37.59%ఓటమి
200913వ శాసనసభ
92 / 294
28.12%ఓటమి
201414వ శాసనసభ
102 / 175
45%Won
201915వ శాసనసభ
23 / 175
40%ఓటమి


లోక్ సభ ఎన్నికలు


సంవత్సరంసాధారణ ఎన్నికలుగెలిచిన స్థానాలు
19848వ లోక్ సభ
30 / 42
19899వ లోక్ సభ
2 / 42
199110వ లోక్ సభ
13 / 42
199611వ లోక్ సభ
16 / 42
199812వ లోక్ సభ
12 / 42
199913వ లోక్ సభ
29 / 42
200414వ లోక్ సభ
5 / 42
200915వ లోక్ సభ
6 / 42
201416వ లోక్ సభ
16 / 42
201917వ లోక్ సభ
3 / 25


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *