7, మే 2023, ఆదివారం

పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమా?

 పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమా? 


YS రాజశేఖర్ రెడ్డి - ప్రజా ప్రస్థానం - 60 రోజులు - 1,468 కిలోమీటర్లు

నారా చంద్రబాబు - వస్తున్నా మీ కోసం - 28 రోజులు - 2,340 కిలోమీటర్లు

YS జగన్ - ప్రజా సంకల్ప యాత్ర - 341 రోజులు - 3,648 కిలోమీటర్లు

నారా లోకేష్ - యువగళం - 400 రోజులు - 4,000 కిలోమీటర్లు  


                     ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పాదయాత్రలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పాదయాత్ర చేసిన నాయకుడు అధికార పీఠాన్ని అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని, అర్థం చేసుకున్న నాయకునికి ప్రజలు పట్టం కడుతున్నారు. పాదయాత్రలో  ప్రజల మధ్యకు వెళ్ళిన నాయకుడు ఓటమి చెవి చూడలేదు. పాదయాత్ర చేసిన నాయకుడికి, ఆ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ నాయకుల్లో, పార్టీల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాదయాత్రలకు ఒక గుర్తింపు తీసుకున్న వచ్చిన వ్యక్తి డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి. అయన పాదయాత్ర చేసి వరుసగా రెండు సార్లు అధికార  పీఠంను కైవసం చేసుకున్నారు. ఆయన బాటలోనే తర్వాత పాదయాత్రలు జరుగుతున్నాయి.  పాదయాత్ర చేసిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు.

           


           తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 ఏప్రిల్ 9న ప్రజా ప్రస్థానం పేరుతో సంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా సాగి శ్రీకాకుళం లోని ఇచ్చాపురం వద్ద ముగిసింది. మొత్తం 60 రోజులు పాటు సాగిన ఈ పాదయాత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి  1,468 కిలోమీటర్ల దూరం నడిచారు. పాదయాత్ర ఫలితంగా  ఎన్నికలలో 294 అసెంబ్లీ స్థానాలకు కాను 157 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీని సాధించింది. YS రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 

            


     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో 2013లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. 
2012 అక్టోబర్ 2న ప్రారంభమైన వస్తున్నా మీకోసం పాదయాత్ర 28 రోజులపాటు సాగింది. 60 ఏళ్లు దాటినా, ఆరోగ్యపరమైన సమస్యలకు భయపడకుండా పాదయాత్ర చేశారు.  వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు నాయుడు 2,340 కిలోమీటర్ల దూరం నడిచారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 63 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఈ పాదయాత్ర చేశారు. వస్తున్నా మీకోసం పేరుతో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి 2012 అక్టోబర్ మూడవ తేదీన తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలతో సహా 13 జిల్లాలను కవర్ చేస్తూ 2,340 కిలోమీటర్లు పాదయాత్ర జరిగింది. ఆయన పాదయాత్ర కారణంగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 175  స్థానాలకు తెదేపా102  స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షంగా ఉన్న బాజాపా 4  స్థానాలలో విజయం సాధించింది. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు.   

        


                      ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి తండ్రి బాటలోనే పయనించారు. ఆయన 2017 నవంబర్ ఆరవ తేదీన వైయస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సాగిన ఈ పాదయాత్ర 13 జిల్లాలు, 135 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2516 గ్రామాలు మీదుగా, 341 రోజులు పాటు సాగింది. మొత్తం 3,648 కిలోమీటర్ల పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసింది. పాదయాత్ర ఫలితంగా తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలు అక్కను 150 యొక్క అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని YSR కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు కాను 22 పార్లమెంటు స్థానాలను పార్టీ గెలుచుకుంది. తిరుగులేని మెజార్టీతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికార పీఠాన్ని ఎక్కారు.

          


             తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడు తనయుడు కూడా తండ్రి అధికారంలోకి రావడానికి పాదయాత్రని ఎంచుకున్నారు. ఈ పాదయాత్రకు యువగళంగా నామకరణం చేశారు. ఈ పాదయాత్ర 2023 జనవరి 27వ తేదీన కుప్పం నచ్చే ప్రారంభమైంది. పాదయాత్ర సంవత్సరం రోజులకు పైగా సాగుతుంది. చిత్తూరు జిల్లాలో పాదయాత్రను ప్రారంభించి, శ్రీకాకుళం జిల్లాలో  ముగించనున్నారు. సుమారు 450 రోజులపాటు 4,000 కిలోమీటర్లు  పాదయాత్ర జరగనుంది. పాదయాత్రలో  100 నియోజకవర్గాలను కవర్ చేస్తారు. పాదయాత్రలో రోజుకు వంద మందితో లోకేష్ సెల్ఫీ దిగుతారు. స్థానిక సమస్యలపైన ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యుల అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతూ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రతో నారా లోకేష్ కు  మంచి గుర్తింపు వచ్చింది. పాదయాత్రలో ఆయన అనుసరిస్తున్న సంయమనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ సహాయ నిరాకరణ పాటిస్తూ, పాదయాత్రని అడ్డుకోవడానికి అడుగడుగునా పోలీసులను రంగంలోకి దించుతోంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దంటూ ఎక్కడికక్కడ పోలీసులు యువనేతకు తాఖీదులు ఇస్తున్నారు. కొన్నిచోట్ల మైక్ లో మాట్లాడడానికి అనుమతి కూడా ఇవ్వడం లేదు. ఆయన మాట్లాడే మైకును కూడా లాక్కున్న సంఘటనలో ఉన్నాయి. యువనేత కాన్వాయ్ కి కూడా విపరీతంగా ఆటంకాలు సృష్టిస్తున్నారు. అయినా అడ్డంకులు   లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర లోకేష్ ను ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు.  ఈ పాదయాత్ర ముగిసే నాటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. లోకేష్ పాదయాత్ర తేదేపాను అధికారంలోకి తెస్తుందా? లేదా అనేది వేచిచుదల్చిందే.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *