తలుపు తడితే స్పందించే తలుపులపల్లి బాబు రెడ్డి
తలుపు తడితే స్పందించే తలుపులపల్లి బాబు రెడ్డి
నిలువెత్తు రూపం.. తీక్షణంగా చూసే కళ్లు, అడిగిన వారికి లేదని చెప్పలేని మొహమాటం, మడతపడని చొక్కా నెమ్మదిగా మాట్లాడే తత్వం. అంతర్గతం, పైకి అందరికీ కనిపించే రూపం. ఆయన ఎక్కడ తగ్గాలో.. ఎక్కడా నెగ్గాలో తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లో ప్రజాసేవకు కావాల్సిన స్వల్ప ఆగ్రహం, తోటివారిపై ప్రేమ మొత్తం కలబోసితే తలుపులపల్లె బాబురెడ్డి. కానీ, అసలు విషయానికి వెళితే.. దయగల హృదయం ఆయన సొంతం. అవసరం మేరకు ఖర్చుచేసే మనస్థతత్వం, ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్య పడేలా తీసుకొనే నిర్ణయాలు, ఆయన స్థాయిని మేను శిఖరంపై నిలిపాయంటే అతిశయోక్తి కాదు. ఆయన ఒకచేత్తో సంపాదిస్తూ మరో చేత్తో అవసరమైన వారిని ఆదుకోవడం ఆయన నైజం.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లిలో అత్యున్నత కుటుంబానికి చెందిన నాయనరెడ్డి, జయమ్మల కుమారుడు తలుపులపల్లి చంద్రశేఖర్రెడ్డి. ఆ విశాల కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే మంచి నడవడిని, ఒరవడిని ఒంటబట్టించుకొని, కుటుంబ సభ్యులతోను మండల ప్రజలతోను కలివిడిగా ఉంటూ, దినదినాభివృద్ధి చెందుతూ విద్యాభ్యాసాన్ని సజావుగా సాగించారు. ప్రాథమిక విద్యను తలుపులపల్లిలోను, హైస్కూల్ విద్య ఎర్రచెరువు పల్లి హైస్కూల్లోను అభ్యసించారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ విద్యను జిల్లా కేంద్రమైన చిత్తూరులో చదివారు. అయితే తన తండ్రి మొదటి నుంచి గ్రామంలో వీఎంగా పనిచేయడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారితో మంచి సంబంధాలుండేవి. అదే తండ్రి నుంచి వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు. దీనికితోడు ఆస్తిపాస్తులు, అంతస్తులు కల్గి భాగ్యవంతులు కావడం విశేషం. డిగ్రీ విద్య అనంతరం రాజకీయాల్లో అరంగ్రేటం చేశారు. 1979 నుంచి తండ్రి నుంచి వారసత్వంగా వీఎంగా పనిచేశారు. 1988లో తలపలపల్లి గ్రామ సర్పంచుగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపికయ్యారు. 1991లో మండల ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1995లో పోలవరం MPTCగా ఎంపికాయ్యరు. పూతలపట్టు మండల పరిషత్తు ఉపాధ్యక్షులుగా పనిచేసారు. 2000 MPTC గా పాటూరు నుండి గెలుపొందారు. అప్పుడు ఎంపీపీగా పోటీ చేయగా , డ్రాలో టీడీపీ వాళ్లకు వచ్చింది. 2006లో ZPTC గా విజయం సాధించి, జిల్లా పరిషత్తులో ప్రతినిత్యం వహించారు. DCC ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. 1992లో చిత్తూరు డైయిరీ చైర్మన్ పదవికి ప్రయత్నం చేశారు. 8 మంది MLA లు సపోర్టు చేసారు. అయినా ఫలించలేదు. వేపంజేరి నియోజక వర్గానికి PCC సభ్యులుగా పనిచేసారు. 1996, 1999 లో చిత్తూరులో MP టిక్కెట్టు కోసం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రయతించారు. BC లకు ఇవ్వాలని అధిష్టానం భావించడంతో చేజారింది. కాంగ్రెస్ పాలనలో 2011లో YSR కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసారు. అలాగే పూతలపట్టు మండలం, వేపంజేరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రెసిడెంట్ గా పనిచేశారు. పూతలపట్టు మండలంలో ఏ సమస్య వచ్చినా, బాబురెడ్డి తలుపు తడుతారు. సమస్యను అయన దృష్టికి తీసుకువస్తే చాలు పరిస్కారం అయన చూసుకుంటారు. పది సార్లు కలవాల్సిన పనిలేదు. పదే పదే గుర్తు చేయాల్చిన అవసరం అంతకన్నా లేదు. సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించారు. కుల, మత, పార్టీలు, వర్గాలకతీతంగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. అందుకే మండలంలోని గ్రామీణ ప్రజలంతా ఎప్పుడూ ఆయన వెంటే వుంటారు. ఆయా గ్రామాలకు వెళితే అక్కడ ప్రజలను పేర్లతో పిలిచేటంత సుపరిచయస్తులు. రాజకీయంగానే గాకుండా రైతు సమస్యల పరిష్కారానికి సైతం రైతు సంఘాలతో కలసి పనిచేస్తున్నారు. తనకున్న పొలాల్లో జామ, మామిడి వంటి పంటలు పండిస్తున్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు మామిడి రైతులకు అండగా వుండేందుకు మామిడి గుజ్జు పరిశ్రమను పూతలపట్టు మండలంలోని తన స్వగ్రామమైన తలుపులపల్లిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం YSR కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గ కన్వీనర్ గా పార్టీ ప్రతిష్టకు విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. సొంత నియోజక వర్గం అయినా పూతలపట్టు, ఇంఛార్జిగా ఉన్న పెనుగొండ నియోజక వర్గాలలో పార్టీ పటిష్ఠతకు, రానున్న ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో పాటూరి రామలింగారెడ్డి, పాలకల నరసింహారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఆదర్శంగా తీసుకొని కార్యాచరణతో, అంకితభావంతో అనుకున్నది సాధించే దిశగా ముందుకెళుతున్నారు.
రాష్ట్ర సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి పనితీరుపై ఆయన ప్రస్తావిస్తూ నవరత్నాల హామీతో.. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. ఆరు నెలల్లోనే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని మాటిచ్చారు. ఆ దిశగా కార్యాచరణతో రాష్ట్ర ప్రజల మెప్పుపొందుతున్నారు. గతంలో ఏ మాత్రం పాలన అనుభవం లేని ఆయన... ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన చాణిక్యనీతిని ప్రదర్శిస్తున్నారనేది నిజం. సీఎం కాగానే పింఛన్ల పెంపు ఫైలుపై తొలిసంతకం చేశారు. గ్రామ చాలంటీర్లు, గ్రామ సచివాలయాలు కలిపి సుమారు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. దశలవారీగా మద్యపానం నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్ట్ షాపులను రద్దు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ.. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. మద్యం రేట్లు భారీ పెంచి మద్యం ప్రియులకు మద్యపానమంటేనే విరక్తి పుట్టిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంపుకోసం తెలంగాణాతో పోరాటం సాగిస్తున్నారు. ఇసుక కొరతను తీర్చేందుకు నూతన ఇసుక విధానం తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పరిపాలనా రాజధానిగా విశాఖ, సచివాలయం నిర్వహణకు అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలును జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మొన్న మహిళలు, నిన్న విద్యార్థులు, నేడు రైతులు, కాపులు ఇలా అన్ని వర్గాలను ఆదుకుంటూ వస్తున్నారు. కరోనా కష్టాల్లో ప్రభుత్వాల తీరు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. పేదల అకౌంట్లలో 500 రూపాయలు విదిల్చి.. పెద్దల కోసం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ సిద్ధం చేసింది కేంద్రం, పేదలకు సరైన రవాణా సౌకర్యాలు కల్పించలేని కేంద్రం, విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు సిద్ధం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అభివృద్ధి పథకాలకు మంగళం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మాట మీద నిలబడ్డారు. జగన్ ధైర్యమేంటో తెలియదు కానీ రైతులు, మహిళలు, విద్యార్థులకు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక సాయం అందించి అందరి మనసు గెలుచుకుంటున్నారు. మహిళలకు సున్నావడ్డీ పేరిట నిధులు బ్యాంకుల్లో జమచేశారు. ఆ తర్వాత విద్యాదీవెన నిధులు విడుదలయ్యాయి. రైతు భరోసా సొమ్ములు బ్యాంకుల్లో పడ్డాయి. మొత్తం 49,48,590 మంది రైతులకు లబ్ది చేకూర్చారు. గతేడాది రైతు భరోసా సొమ్ము పూర్తిగా రైతులందరికీ అందింది. మేనిఫెస్టోలో చెప్పింది ఏడాదికి 12,500 అది కూడా నాలుగేళ్ల, కానీ వాస్తవానికి ఏడాదికి 18,500 రూపాయలు ఐదేళ్ల పాటు ఇస్తున్నారు జగన్. దీనిలో భాగంగా 2,800 కోట్ల రూపాయలు తొలి విడతగా రైతుల ఖాతాల్లో వేసింది ప్రభుత్వం, రాష్ట్ర ఖజానాకు నిధులు మిగుల్చుతూనే, మరోవైపు సంక్షేమ పథకాలకు ఎలాంటి నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేస్తున్నారు. అత్యంత పిన్న వయసులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ తన మేనిఫెస్టోను ఓ భగవద్గీత, ఓ ఖురాన్, బైబిల్ లా భావించి అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
బాబురెడ్డి నాయకత్యంలో పూతలపట్టు మండలం అభివృద్ధి పరంగా దూసుకెళుతోంది. మండలంలో నాయుడు పేట-బెంగుళూరును కలుపుతూ 6 లైన్ల రోడ్లు విస్తరణ, మరోవైపు పీలేరు-చిత్తూరు రహదారిని 4 లైన్ల రోడ్డుగా విస్తరించారు. పూతలపట్టులో ఐదారు సబ్ స్టేషన్లను మంజూరు చేయించారు. ప్రైవేటు పరంగా గుజ్జు ఫ్యాక్టరీలు ముమ్మరంగా వెలిశాయి. పేటమిట్టలో అమరరాజా, రైతులకు ఉపయోగపడే గుజ్జు ఫ్యాక్టరీలు, నియోజకవర్గంలో 15కు పైగా వివిధ ఫ్యాక్టరీలు వున్నాయి. దీంతో అటు కార్మికులకు, ఇటు ఉద్యోగ పరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో ఐరాల, పూతలపట్టు మండలాలకు సాగునీటి కోసం సుమారు రూ.1000 కోట్లతో నామంచిపురం నీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఎలాంటి కరువు కాటకాలు వచ్చిన రైతు, ప్రజలకు తాగు, సాగునీటికి ఇబ్బందులు వుండవని చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు ఎన్నికల్లో కూడా అత్యంత అధిక సీట్లను సాధించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పూతలపట్టు మండలంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీని తీసుకొస్తామన్నారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్న తలుపులపల్లి చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ బాబురెడ్డి భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి ప్రజాసేవలో తరించాలని ఆశిద్దాం.