9, ఫిబ్రవరి 2026, సోమవారం

సాకారమైన పెనుమూరు బైపాస్ రోడ్డు కల !

ఆంధ్రప్రభ వార్తకు స్పందన 
రూ 99.46 లక్షలతో  అంచనా తయారు
చొరవ చూపిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 
పెనుమూరు ప్రజలలో ఆనందోత్సాహాలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

మండల కేంద్రమైన పెనుమూరు ప్రజలు గత 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బైపాస్ రోడ్డు కల సాకారం అయ్యింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రోడ్డు నిర్మాణంకోసం అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. పంచాయతీ ఎన్నికలకు ముందే రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కేనా అంటూ జనవరి 5 వ తేదీ ఆంధ్రప్రభలో వార్త వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సమస్యను తెలియజేస్తూ పెనుమారు వాసి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పవన్ మంత్రి కళ్యాణ్ కు లేఖ రాశారు. ఆయన ఆదేశాలతో పంచాయతీ అధికారాలు 1.35 కిలో మీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ 99.46 లక్షలతో ఎస్టిమేట్లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రోడ్డు నిర్మాణంతో పెనుమూరు మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

1985 లో గ్రామ అభివృద్ధి కోసం అప్పటి సర్పంచ్ పి భక్తవత్సల నాయుడు మాస్టర్ ప్లాన్ లో రెండు బైపాస్ రోడ్లను పొందు పరిచేలా కృషి చేశారు. అప్పట్లోనే కార్వేటినగరం రోడ్డు నుంచి ప్రస్తుత మండల కార్యాలయాల సముదాయం వరకు బైపాస్ రోడ్డు నిర్మించారు. అయితే చిత్తూరు  పాకాల రోడ్డు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముత్యాలమ్మ గుడి బస్టాండు, బజారు తూర్పు వీధి ద్వారా కార్వేటినగరం, పుత్తూరు రోడ్డు వరకు ప్రతిపాదించిన 40 అడుగుల వెడల్పు 1.35 కిలో మీటర్లు పొడవు రోడ్డు ఆగి పోయింది. ఈ మార్గంలో రోడ్డు నిర్మాణం చేస్తే బస్టాండు, సంత గేటు, ఉన్నత పాఠశాల, బజారు వీధిలో ట్రాఫిక్ సమస్య తొలగిపోతుంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండు, మండల ప్రజాపరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, బస్టాండు, బజారుకు ఇరు వైపులా రాకపోకలు మెరుగవుతాయి. గతంలో పవన్ కళ్యాణ్ చొరవతో బస్టాండు వాణిజ్య సముదాయంలో ఉన్న 23 గదుల వేలం జరిగింది. అయితే వేలంలో అవకతవకలు జరిగాయని కొందరు హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీని వల్ల పంచాయతీ ఆదాయానికి గండి పడింది. అయితే దీనిపై త్వరలో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా చార్వాకాని పల్లె పంచాయతీని పెనుమూరు పంచాయతీలో విలీనం చేయడంపై కొందరు హై కోర్టులో స్టే తేవడంతో ఇక్కడ ఎన్నికలు ఆగి పోయాయి. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు సంవత్సరానికి రూ 50 కు పైగా ఆగిపోయాయి. పంచాయతీ అభివృద్ధి కుంటుబడింది. ఇప్పటికీ ఈ కేసు హైకోర్టులో పెండింగులో ఉన్నందున మార్చిలో పెనుమూరు పంచాయతీ ఎన్నికలు జరుగుతుతాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా పెనుమూరు నుంచి నేండ్రగుంట వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మార్గం అభివృద్ధి చెందితే తిరుపతి నుంచి పెనుమూరు సమీపంలో ఉన్న పర్యాటక కేంద్రం పులిగుండుకు రాకపోకలు మెరుగవుతాయని అంటున్నారు. ఇందులో ఐదు కిలోమీటర్లు జి డి నెల్లూరు నియోజక వర్గంలోనూ, ఆరు కిలో మీటర్లు చంద్రగిరి నియోజక వర్గంలో ఉన్నాయి. కాబట్టి జి డి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెనుమూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి చొరవ చూపిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆయన ఆదేశాలతో బస్టాండు వాణిజ్య సముదాయంలో గదుల వేలం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పెనుమూరు గ్రామంతో పాటు మండలం అభివృద్ధికి కృషి జరుగుతోందని చెప్పారు.

గంగ 1ఏ ఆంధ్రప్రభ వార్త
1బి బైపాస్ రోడ్డు ప్లాన్ 
1సి బైపాస్ రోడ్డు వెళ్లే భూములు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *