9, అక్టోబర్ 2023, సోమవారం

జీ డి నెల్లూరు జనసేన కార్యాలయం ప్రారంభం


గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఘనంగా, అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన కేంద్ర కార్యాలయాన్ని  చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షలకు  జనసేన సంఘీభావం  తెలియచేశారు. జనసేన తెలుగుదేశం సంయుక్తంగా వైసీపీని  ఇంటికి పంపుతుందని ధీమాను వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగు దేశం కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలనకు స్వస్తి పలుకాలంటే, రెండు పార్టీలు కలిసి పనిచేయాల్చిన అవసరం ఉందన్నారు. రానున్నది తెదేపా, జనసేన ప్రభుత్వమని, ఇప్పటి నుండి సమన్వయంతో పనిచేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో  చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు  లోకనాథం నాయుడు, నియోజకవర్గ ఇన్చార్జ్  డాక్టర్ యుగంధర్ పొన్న, కృష్ణయ్య, నియోజకవర్గంలో ఉన్న జీడి నెల్లూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటాద్రి గుణ రషీద్, ప్రధాన కార్యదర్శులు  ఉదయ్, పోతన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు  సురేష్ వెంకటేష్, చంద్రమౌళి, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు  శోభన్ బాబు, యువజన అధ్యక్షుడు నరసింహులు, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలు దేవా, మండల కార్యదర్శి దేవా, గణేష్, జిల్లా సమీక్ష కార్యదర్శులు రాఘవ, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి నరేష్,  ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు  చిరంజీవి, ఉపాధ్యక్షులు చార్లెస్, చంద్ర, పాలసముద్రం మండల అధ్యక్షులు  లతీష్ కుమార్, ఉపాధ్యక్షులు రాఘవ, జిల్లా సంయుక్త కార్యదర్శి  భాను ప్రసాద్, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షుడు సతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శెట్టి, పెనుమూరు మండల జనసైనికులు, వీర మహిళ విభాగం రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్  వనజ, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన,  లావణ్య, లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆరు మండలాల్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  థామస్, నాయకులు, తెలుగు తమ్ముళ్లు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *