ఆదాయపు పన్ను విభాగంలో రూ.13.6 కోట్లు స్వాహా
శుక్రవారం కోర్టులో లొంగిపోయిన కీలక నిందితుడు
మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, వాయల్పాడు, పుంగనూరులోని ట్రెజరీ కార్యాలయాల్లో గోల్మాల్
ముగ్గురిపై మదనపల్లి పోలీసులు కేసు నమోదు
ముగ్గురు టీటీవోలకు ఛార్జ్ మెమోలను జారీ
నలుగురు నిందితులను అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు
నకిలీ టిడిఎస్ క్లెయిమ్స్ ఫైల్ చేసి 12 కోట్ల స్వాహా చేసిన కేసులో ఆడిటర్ శ్రీనాథ్ శుక్రవారం కోర్టులో లొంగిపోయాడు. చిత్తూరులో ట్రెజరీలో భారీ కుంభకోణం జరిగింది. నకిలీ టిడిఎస్ క్లెయిమ్స్ ఫైల్ చేసి 12 కోట్ల స్వాహా చేశారు. ఇందులో ఆడిటర్ శ్రీనాథ్ కీలకంగా వ్యవహరించాడు. టీడీఎస్ రిటర్న్స్ పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన శ్రీనాథ్ శుక్రవారం జిల్లా కోర్టులో లొంగిపోయాడు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ కుంభకోణం భారీగా జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. అర్హత లేని క్లెయిమ్ ద్వారా పన్ను రిఫండ్, మినహాయింపులు పేరుతో భారీగానే కొందరు సొమ్ము చేసుకున్న ఘటన ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. తాజాగా అన్నమయ్య జిల్లా లో టి డి ఎస్ స్కామ్ పెద్ద మొత్తములో వెలుగు చూసింది. ఆదాయపు పన్ను విభాగంలో 13.6 కోట్ల టీడీఎస్ రిఫండ్ సొమ్మును కాజేసినట్టు ఆధారాలు లభించాయి. అయితే వీరు మాత్రమే ఇందులో ఉన్నారా..? ఇంకా ఎవరి పాత్రైనా ఉందా..? ఈ లింకులు ఇంకెక్కడ ఉన్నాయి అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఆడిటర్ శ్రీనాథ్ శుక్రవారం కోర్టులో లొంగిపోయాడు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల్లో స్కాం జరిగింది. బోగస్ క్లెయిమ్‌లు సమర్పించి ముగ్గురు దుండగులు రూ. 3 కోట్లు కొట్టేశారు. తిరుపతి ఐటీ అధికారి రాజశేఖర్ ఫిర్యాదుతో కుంభకోణం బయటపడింది. దీంతో ముగ్గురిపై మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలిసుల దర్యాప్తులో మొత్తం 12కోట్ల రూపాయలను నకిలీ టిడిఎస్ క్లెయిమ్స్ ఫైల్ చేసి స్వాహా చేసినట్లు తేలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, వాయల్పాడు , పుంగనూరులోని ట్రెజరీ కార్యాలయాల్లో టీడీఎస్ బోగస్ క్లెయిమ్‌లను ఐటీ శాఖ గుర్తించింది. ముగ్గురు టీటీవోలకు సైతం ఖజానా శాఖ అధికారులు ఛార్జ్ మెమోలను జారీ చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును క్లెయిమ్‌ల రూపంలో సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలోని పలు ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లుగా భావిస్తున్న ఐటీ శాఖ వాటిపై ఫోకస్ పెట్టింది. లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయంటున్నారు.అన్నమయ్య జిల్లాలో ముగ్గురు సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ,ఒక సీనియర్ అసిస్టెంట్ ను అరెస్ట్ చేశారు. తిరుపతి ఇన్కమ్ టాక్స్ అధికారి రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మదనపల్లి డిఎస్పి కేశప్ప వెల్లడించారు.అరెస్ట్ అయిన వారిలో తంబాళ్ళపల్లి ఎస్ టి ఓ శ్రీనివాసులు, బాలమురళి పీలేరు ఎస్ టి ఓ ఇంతియాజ్ ట్రెజరీ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ జీవానందం, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో 2015 నుంచి 2022 అసెస్మెంట్ వరకు రూ.37,62,03,648 కోట్ల రూపాయల సొమ్మును ఫైల్ చేసి అందులో మోసపూరితంగా 13.6 కోట్ల రూపాయలను రిఫండ్ చేసుకొని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని నిందితులు తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచలనం లేపిన ట్రెజరీ బిల్లుల కుంభకోణంలో జిల్లాలోని పలు ఉప ఖజనా కార్యాలయాల్లో అధికారులు బోగస్ టీడీఎస్ బిల్లులు క్లెయిమ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సబ్ ట్రెజరీ అధికారులు , ఒక అకౌంటెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులపై తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లి పోలీసులు ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులపై కేసులు నమోదు చేశారు. మదనపల్లి ఎస్టీవో శ్రీనివాస్, తంబళ్లపల్లి ఎస్టీవో బాలమురళి, పీలేరు ఎస్టీవో కార్యాలయంలోని సీనియర్ అకౌంటెంట్ ఇంతియాజ్ అలీపై కేసులు నమోదయ్యాయి. వీరంతా బోగస్ క్లెయిమ్‌లు సమర్పించి రూ.3 కోట్లు గండికొట్టారని వీరిపై ఆరోపణలు వచ్చాయి.